Kadapa: పోలీసులను చూసి లారీ వదిలి పరార్.. లోపల చెక్ చేయగా….

భూమండలంలో ఎక్కడా దొరకని ఎర్రచందనం మనకు మాత్రమే సొంతం. అలాంటి అరుదైన సంపదను దోచుకెళ్తున్నారు కొందరు కేటుగాళ్లు. తాజాగా కడప జిల్లాలో 158 ఎర్రచందనం దుంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Kadapa: పోలీసులను చూసి లారీ వదిలి పరార్.. లోపల చెక్ చేయగా....
Abandoned Lorry
Follow us

|

Updated on: Jul 03, 2024 | 9:00 AM

కడప జిల్లాలో భారీగా ఎర్రచందనం పట్టుబడింది. ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి దగ్గర లారీలో లోడ్‌ చేసిన 158 ఎర్రచందనం దుంగలు సీజ్ చేశారు పోలీసులు. ఆ ఎర్రచందనం దుంగలకు ప్లాస్టిక్ పట్టాలు కట్టి తరలిస్తున్నారు స్మగర్లు. ఐతే పోలీసుల రాక గమనించిన స్మగ్లర్లు దుంగలు వదిలి పరారైయ్యారు. ఎర్రచందనం వాహనం స్టేషన్‌కు తరలించిన పోలీసులు ఈ డంప్ వెనుక ఎవరున్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైనా ఎర్రచందనం దుంగలను స్మగ్లింగ్ చేసేందుకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అరుదైన రక్తచందనంతో చేసిన కళాకృతులన్నా, ఫర్నిచర్‌ అన్నా చైనావాళ్లకు చెప్పలేని పిచ్చి. అది ఒక్క ముక్క ఉంటే చాలు.. అదృష్టం..దరిద్రపట్టినట్టు పడుతుందని వారి నమ్మకం.! మరోవైపు విలాసవంతమైన ఫర్నిచర్‌తోపాటు అందం ఔషధపరంగానూ కూడా ఎర్రచందనాన్ని వాడుతుంటారు. అందుకే ఆ దేశంలోనూ చుట్టు పక్కల పెరిగే చెట్లన్నీ అంతరించిపోగా..వారి దృష్టి భారతదేశంలోని తూర్పుకనుమల్లో దొరికే రక్తచందనంమీద పడింది. అలా వందల సంవత్సరాల నుంచి ఇక్కడి అరుదైన వృక్ష సంపద చైనా తరలిపోతోంది. ఈ క్రమంలో ఈ చెట్టు అంతరించిపోతున్న జాబితాలోకి చేరిపోయింది. దాంతో స్పందించిన భారత ప్రభుత్వం అడవుల్లోని చెట్లను కొట్టడం చట్ట విరుద్ధమని ప్రకటించింది. వీటిని అమ్మడంతో పాటు పెంచడంపైనా ఆంక్షలు విధించింది. అయినప్పటికీ… అది సరిహద్దులు దాటుతూనే ఉంది. వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఫలితమే… ‘శేషాచలం అడవుల్లో స్మగ్లర్లు..పోలీస్‌ కాల్పుల్లో మరణించారనో లేదా పట్టుబడ్డారనో వార్తలు నిత్యం కనిపిస్తున్నాయి.

ఎర్రచందనం..దానికి కేరాఫ్‌ అడ్రస్‌ ఏపీలోని శేషాచలం కొండలు. ఈ చెట్లు ఎక్కడంటే అక్కడ..ఎప్పుడంటే అప్పుడు పెరగవు. మొక్కనాటిన 30 సంవత్సరాలకిగానీ మధ్యలోని చెక్క రంగు ఎరుపురంగులోకి మారదు. అదే వంద నుంచి రెండు వందల సంవత్సరాలపాటు పెరిగితే లోపలిభాగం మరింత ఎర్రగానూ వెడల్పుగానూ ఉంటుంది. కాబట్టి చెట్టుకి ఎన్నేళ్లుంటే అది అంత ఖరీదు చేస్తుంది. శేషాచలం నేలలోని ఆమ్లశాతమూ, పోషకాలూ, నీరూ వీటికి పెరుగుదలకి సరిపోతాయి. ఈ రకమైన సమ్మేళనం మరెక్కడా ఉండదనీ, నేలతోపాటు ఇక్కడి వాతావరణమూ ఎర్రచందనం పెరగడానికి దోహద పడుతుందనీ నిపుణులు చెబుతారు.

అక్రమ నరికివేతతో ఎర్రచందనం చెట్లు రోజురోజుకీ అంతరించి పోతుండటంతో అంతర్జాతీయ మార్కెట్‌లో దీనిధర టన్ను కోటిన్నర రూపాయల పైనే పలుకుతుందట. అందుకే అరుదైన రక్తచందనాన్ని కోట్ల రూపాయలు చెల్లించి మరీ అక్రమంగా తరలించేస్తున్నారు స్మగ్లర్లు. పోలీసులూ అటవీశాఖ అధికారులూ రెప్పవాల్చక కాపలా కాస్తుంటారనీ ఏ కాస్త తేడా వచ్చినా ప్రాణాలకే ప్రమాదమనీ తెలిసినా కూడా..వేలమంది రాత్రీపగలూ దాని వేటలోనే ఉంటారు. అంతర్జాతీయ స్మగ్లర్లు దానికోసం ఎన్ని కోట్ల రూపాయలైనా చెల్లిస్తారు. నిజానికి ఎర్రచందనం చెట్లని కొట్టి, మోసుకెళ్లే వాళ్లలో చాలామందికి అది చట్టవిరుద్ధం అని కూడా తెలీదు. పొట్టకూటికోసమే ఇతరరాష్ట్రాలనుంచి వచ్చి ఆ పనికి ఒప్పుకుంటారు. అసలు ఆ చెక్క ఎందుకు… ఎక్కడికి వెళుతుంది… దేనికి వాడతారు… వంటివేమీ వాళ్లకు పట్టదు. వారికి తెలిసిందల్లా..అడ్డువచ్చిన వాళ్లను అంతం చేసైనా దాన్ని చెప్పినచోటుకి చేర్చడం. దీంతో పోలీసులకు స్మగ్లర్లను, ఎర్రచందనం కూలీలను అడ్డుకోవడం ప్రాణలమీదకు తెస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..  

కల్కిలో దిశా పటని రోల్‌ను ఆ స్టార్ హీరోయిన్ మిస్ చేసుకుందా..?
కల్కిలో దిశా పటని రోల్‌ను ఆ స్టార్ హీరోయిన్ మిస్ చేసుకుందా..?
శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తుంటే విటమిన్ డి లోపం ఏమో చెక్ చేయండి
శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తుంటే విటమిన్ డి లోపం ఏమో చెక్ చేయండి
రైతు భరోసాపై భేటీకానున్న కేబినెట్ సబ్ కమిటీ.. ఈ అంశాలపై చర్చ..
రైతు భరోసాపై భేటీకానున్న కేబినెట్ సబ్ కమిటీ.. ఈ అంశాలపై చర్చ..
Team India: ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ రేసులో మనోళ్లే ముగ్గురు..
Team India: ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ రేసులో మనోళ్లే ముగ్గురు..
నువ్వులతో ఆరోగ్యమే కాదు.. అందం కూడా.. ఇలా వాడితే బోలెడు లాభాలు..!
నువ్వులతో ఆరోగ్యమే కాదు.. అందం కూడా.. ఇలా వాడితే బోలెడు లాభాలు..!
తిరుమలలో టాటా గ్రూప్ చైర్మన్.. స్వాగతం పలికిన టీటీడీ ఈవో..
తిరుమలలో టాటా గ్రూప్ చైర్మన్.. స్వాగతం పలికిన టీటీడీ ఈవో..
అనంత్-రాధిక ప్రీ వెడ్డింగ్ కోసం హాలీవుడ్ పాప్ సింగర్..
అనంత్-రాధిక ప్రీ వెడ్డింగ్ కోసం హాలీవుడ్ పాప్ సింగర్..
అక్కా ఎలా వస్తాయి మీకు ఈ ఐడియాలు.. మటన్ కీమాతో కేక్ తయారీ..
అక్కా ఎలా వస్తాయి మీకు ఈ ఐడియాలు.. మటన్ కీమాతో కేక్ తయారీ..
ఇలా చేస్తే సీజనల్ వ్యాధులు అవుట్.. ఇంట్లో నుంచే సింపుట్ రెమిడీ..
ఇలా చేస్తే సీజనల్ వ్యాధులు అవుట్.. ఇంట్లో నుంచే సింపుట్ రెమిడీ..
బీట్ రూట్ ఆరోగ్యానికి మంచిదని అదే పనిగా తింటున్నారా..?
బీట్ రూట్ ఆరోగ్యానికి మంచిదని అదే పనిగా తింటున్నారా..?
అంతరిక్షంలోకి ప్రధాని మోదీ.? గగన్‌యాన్‌ మిషన్‌పై ఇస్రో సమాచారం..
అంతరిక్షంలోకి ప్రధాని మోదీ.? గగన్‌యాన్‌ మిషన్‌పై ఇస్రో సమాచారం..
గుడ్ న్యూస్.. కల్కి టికెట్స్ రేట్స్ తగ్గుతున్నాయ్‌..!
గుడ్ న్యూస్.. కల్కి టికెట్స్ రేట్స్ తగ్గుతున్నాయ్‌..!
స్పెర్మ్‌ కౌంట్‌ పెంచే ఆహార పదార్థాలు.. అదిరిపోయే లిస్ట్.
స్పెర్మ్‌ కౌంట్‌ పెంచే ఆహార పదార్థాలు.. అదిరిపోయే లిస్ట్.
కిమ్‌ అరాచకం.. సాంగ్స్ విన్నాడని యువకుడికి బహిరంగ ఉరి.. వీడియో.
కిమ్‌ అరాచకం.. సాంగ్స్ విన్నాడని యువకుడికి బహిరంగ ఉరి.. వీడియో.
ఒక్కసారిగా రోడ్డుపై భారీ మొసలి ప్రత్యక్షం.. వాహనదారులు హడల్‌.!
ఒక్కసారిగా రోడ్డుపై భారీ మొసలి ప్రత్యక్షం.. వాహనదారులు హడల్‌.!
దానికదే గాల్లోకి ఎగిరిన చైనా రాకెట్‌.! పెద్దఎత్తున చెలరేగిన మంటలు
దానికదే గాల్లోకి ఎగిరిన చైనా రాకెట్‌.! పెద్దఎత్తున చెలరేగిన మంటలు
కేసీఆర్‌కు హైకోర్టు షాక్‌.! ఆ పిటిషన్‌ కొట్టివేత..
కేసీఆర్‌కు హైకోర్టు షాక్‌.! ఆ పిటిషన్‌ కొట్టివేత..
కొత్త క్రిమినల్‌ చట్టాల్లోని కీలక నిబంధనలు ఇవే..!
కొత్త క్రిమినల్‌ చట్టాల్లోని కీలక నిబంధనలు ఇవే..!
నడి రోడ్డుపై కుప్పకూలిన విమానం.. వీడియో వైరల్.
నడి రోడ్డుపై కుప్పకూలిన విమానం.. వీడియో వైరల్.
అదృష్టవశాత్తు తప్పిన ముప్పు.! ఊపిరి పీల్చుకున్న శాస్త్రవేత్తలు..
అదృష్టవశాత్తు తప్పిన ముప్పు.! ఊపిరి పీల్చుకున్న శాస్త్రవేత్తలు..