సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్ అత్యధిక మోజార్టీతో విజయదుందుబి మోగించారు. ఈ విజయంతో పార్టీ కార్యకర్తలు, అభిమానులు టపాసులు కాల్చి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో.. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు ఇంటి వద్ద వైసీపీ కార్యకర్తలు ‘బైబై బాబూ’ అంటూ నినాదాలు చేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది. వైసీపీ కార్యకర్తలు పార్టీ పతాకాలతో ర్యాలీగా చంద్రబాబు నివాసం వైపుగా వచ్చారు. దీంతో.. అక్కడే ఉన్న టీడీపీ కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట చేటుచేసుకుంది. పోలీసులు ఎంటర్ అవ్వడంతో ఇరు వర్గాలను చెదరగొట్టారు. అయినప్పటికీ కార్యకర్తలు అరగంట వరకూ చంద్రబాబు ఇంటి వద్ద నినాదాలు చేశారు.