బ్యాంక్‌ స్కామ్‌.. చంద్రబాబు పీఏపై ఫిర్యాదు..!

కుప్పం కో ఆపరేటివ్‌ టౌన్ బ్యాంక్‌లో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పీఏ పి.మనోహర్ స్కాం చేశారని వైసీపీ నేత విద్యాసాగర్‌ ఆరోపణలు చేశారు.

  • Tv9 Telugu
  • Publish Date - 5:04 pm, Thu, 30 April 20
బ్యాంక్‌ స్కామ్‌.. చంద్రబాబు పీఏపై ఫిర్యాదు..!

కుప్పం కో ఆపరేటివ్‌ టౌన్ బ్యాంక్‌లో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పీఏ పి.మనోహర్ స్కాం చేశారని వైసీపీ నేత విద్యాసాగర్‌ ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.

కాగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బ్యాంక్‌లో అవకతవకలు జరిగాయని.. ఇటీవల నిర్వహించిన ఆడిటింగ్‌లో దానికి సంబంధించిన స్కాం బయటపడిందని విద్యాసాగర్ అన్నారు. ఆడిట్‌లో బంగారం విషయంలో లెక్కలు తేడా వచ్చాయని తేలినట్లు విద్యాసాగర్ పేర్కొన్నారు. అలాగే కుప్పంలో ఉన్న ప్రసన్న తిరుపతి గంగమాంబ దేవస్థానంకు సంబంధించిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపైనా పీఏ మనోహర్‌ లోన్‌లు తీసుకున్నట్లు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ దేవస్థానం పేరిట మొత్తం 16 బాండ్లు కుదువపెట్టి లోన్‌లు తీసుకున్నట్లు తేలిందని విద్యాసాగర్ తన ఫిర్యాదులో వివరించారు. కాగా ఈ వ్యవహారం కంటే ముందే కుప్పం టౌన్ బ్యాంకులో దాదాపు రెండు కోట్ల రూపాయల భారీ స్కామ్ జరిగింది. కొందరు ప్రముఖులు ఫిక్సిడ్ డిపాజిట్‌లపై లోన్లు తీసుకుని స్వాహా చేసినట్లు తేలింది. ఈ వ్యవహారం మొత్తంలో బ్యాంకు మేనేజర్, అప్రయజర్ మరో ఇద్దరు సిబ్బందితో ఉన్నట్లు తెలిసింది. దీంతో నలుగురిని సస్పెండ్ చేసిన అధికారులు….దీనిపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే చంద్రబాబు పీఏ మనోహర్ వ్యవహారంపై వైసీపీ నేత పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

Read This Story Also: మహేష్ నిర్మాణంలో చెర్రీ..!