CM Jagan : ఇంటింటికీ వెళ్లి అక్కచెల్లెమ్మల ఫోన్లలో ఆ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసేలా చూడాలి : సీఎం జగన్మోహన్ రెడ్డి

రాష్ట్రంలో మహిళలు, యువతుల భద్రతపై ప్రత్యేక దృష్టిపెట్టాలని ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. దిశ యాప్‌పై పూర్తి చైతన్యం కలిగించాలని సీఎం..

CM Jagan : ఇంటింటికీ వెళ్లి అక్కచెల్లెమ్మల ఫోన్లలో ఆ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసేలా చూడాలి : సీఎం జగన్మోహన్ రెడ్డి
CM YS Jagan

Updated on: Jun 23, 2021 | 2:51 PM

CM Jagan meeting on Disha APP : రాష్ట్రంలో మహిళలు, యువతుల భద్రతపై ప్రత్యేక దృష్టిపెట్టాలని ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. దిశ యాప్‌పై పూర్తి చైతన్యం కలిగించాలని సీఎం సూచించారు. దిశ యాప్ ను ఎలా వాడాలన్నదానిపై అవగాహన కలిగించాలన్న సీఎం, ఇందుకోసం ఇంటింటికీ వెళ్లి అక్కచెల్లెమ్మల ఫోన్లలో యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసేలా చూడాలని ఆదేశించారు. మహిళల భద్రతపై సీఎం వైయస్‌ జగన్ ఇవాళ అమరావతిలో అత్యున్నతస్థాయి సమావేశం నిర్వహించారు. హోంమంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతం సవాంగ్, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ కె.వి.రాజేంద్రనాథ్‌రెడ్డి, సీఎంఓ అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

గ్రామ సచివాలయాల్లోని వాలంటీర్లతో కలిసి మహిళా పోలీసులు.. రాష్ట్రంలోని అక్క చెల్లెమ్మలకు అవగాహన కలిగించాలని సీఎం అన్నారు. ముందుగా మహిళా పోలీసులకు, వాలంటీర్లకు శిక్షణ ఇచ్చి.. వారి ద్వారా అక్క చెల్లెమ్మలకు అవగాహన కలిగించాలని సీఎం సూచించారు. ప్రమాదకర పరిస్థితుల్లో దిశ యాప్‌ను ఎలా ఉపయోగించాలన్నదానిపై అక్క చెల్లెమ్మలకు చెప్పాలని సీఎం జగన్ అధికార్లకు దిశానిర్దేశం చేశారు. దీన్ని ఒక డ్రైవ్‌గా తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

అలాగే .. కాలేజీలు, విద్యాసంస్థల్లో కూడా విద్యార్థినులకు దిశ యాప్‌ వినియోగంపై అవగాహన కలిగించాలన్న సీఎం.. ఈ చర్యల వల్ల దిశ యాప్‌ వినియోగం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. అక్క చెల్లెమ్మలను ఆదుకునేలా ఆ మేరకు వెను వెంటనే చర్యలు తీసుకునేలా యంత్రాంగం సిద్ధంకావాలని సీఎం అన్నారు. దిశ పోలీస్‌స్టేషన్లు, స్థానిక పోలీస్‌స్టేషన్లు సత్వరమే స్పందించేలా వారిని సన్నద్ధంచేయాలని సూచించారు. పోలీస్‌ స్టేషన్లలో అవసరమైనన్ని పెట్రోలింగ్‌ వాహనాలను సమకూర్చాలని సీఎం చెప్పారు.

Read also : Etela : ఒక ఉద్యమ పార్టీ తెలంగాణ వచ్చిన తర్వాత ధర్నా చౌక్ ఎత్తేసింది.. ‘మమ్మల్ని ఇబ్బంది పెడితే మసే..’ : ఈటల

Loading...
Unable to load recommendations.
Follow Us