ఏపీ కేబినెట్‌ భేటీకి ఈసీ ఓకే.. కండిషన్స్ అప్లై

ఏపీ కేబినెట్‌ సమావేశం నిర్వహణపై ఉత్కంఠ తొలగిపోయింది. భేటీకి ఈసీ పలు షరతులతో అనుమతిని మంజూరు చేసింది. దీంతో ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటలకు ఏపీ కేబినెట్‌ మీటింగ్ జరగనుంది. కేవలం అజెండాలోని అంశాలను మాత్రమే కేబినెట్‌లో చర్చించాలని ఈసీ సూచించింది. రేట్ల పెంపు, బిల్లుల విడుదలపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదని పేర్కొంది. అలాగే కేబినెట్‌ నిర్ణయాలపై మీడియా సమావేశం పెట్టొద్దని షరతు విధించింది. దీంతో కేవలం కరువు, ఫొని తుఫాను, తాగునీటిపై మాత్రమే కేబినెట్‌లో మంత్రివర్గం […]

ఏపీ కేబినెట్‌ భేటీకి ఈసీ ఓకే.. కండిషన్స్ అప్లై

Edited By:

Updated on: May 14, 2019 | 11:29 AM

ఏపీ కేబినెట్‌ సమావేశం నిర్వహణపై ఉత్కంఠ తొలగిపోయింది. భేటీకి ఈసీ పలు షరతులతో అనుమతిని మంజూరు చేసింది. దీంతో ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటలకు ఏపీ కేబినెట్‌ మీటింగ్ జరగనుంది. కేవలం అజెండాలోని అంశాలను మాత్రమే కేబినెట్‌లో చర్చించాలని ఈసీ సూచించింది. రేట్ల పెంపు, బిల్లుల విడుదలపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదని పేర్కొంది. అలాగే కేబినెట్‌ నిర్ణయాలపై మీడియా సమావేశం పెట్టొద్దని షరతు విధించింది. దీంతో కేవలం కరువు, ఫొని తుఫాను, తాగునీటిపై మాత్రమే కేబినెట్‌లో మంత్రివర్గం సమీక్షించనుంది.