క్లైమాక్స్‌కు చేరిన మండలి రద్దు అంశం..

ఏపీ శాసన మండలి రద్దు అంశం దాదాపు ఫైనల్ స్టేజ్‌కు చేరుకుంది. అసలు శాసనమండలిని నిజంగానే రద్దు చేస్తారా? లేక యథాతథంగా కొనసాగిస్తారా అన్నదానిపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ఈ అంశంపై మరికాసేపట్లో తెరపడనుంది. ఇవాళ జరిగే అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శాసనసభలో మండలి అంశంపై ప్రత్యేక చర్చ జరపాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. అయితే ఈ సమావేశానికి ముందు.. ఉదయం 9.30 కి సచివాలయంలో.. సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశమవుతుంది. అయితే ఈ […]

క్లైమాక్స్‌కు చేరిన మండలి రద్దు అంశం..

Updated on: Jan 27, 2020 | 8:21 AM

ఏపీ శాసన మండలి రద్దు అంశం దాదాపు ఫైనల్ స్టేజ్‌కు చేరుకుంది. అసలు శాసనమండలిని నిజంగానే రద్దు చేస్తారా? లేక యథాతథంగా కొనసాగిస్తారా అన్నదానిపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ఈ అంశంపై మరికాసేపట్లో తెరపడనుంది. ఇవాళ జరిగే అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శాసనసభలో మండలి అంశంపై ప్రత్యేక చర్చ జరపాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. అయితే ఈ సమావేశానికి ముందు.. ఉదయం 9.30 కి సచివాలయంలో.. సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశమవుతుంది. అయితే ఈ సమావేశంలోనే శాసనమండలి భవితవ్యం తేలిపోతుంది. అయితే ఇక్కడే మరో ట్విస్ట్ కూడా ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అధికారపక్షం అనుకున్నట్లుగా మండలిలో బలం వస్తే.. ప్రతిపక్షం నుంచి పాలకపక్షానికి ఎమ్మెల్సీలు వలసవస్తే .. శాసనమండలి సేఫ్‌గా ఉంటుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అలా జరగని పక్షంలో కౌన్సిల్‌ రద్దవుతుందని రాజకీయవర్గాలు చెబుతున్నాయి.

ఏది ఏమైనా మంత్రివర్గ సమావేశంలోనే ప్రభుత్వ నిర్ణయమేంటో తేలిపోబోతోంది. కౌన్సిల్‌ రద్దు చేయాలనుకొంటే.. మంత్రివర్గ సమావేశంలోనే దానిపై తీర్మానం చేస్తారు. ప్రస్తుతం మండలి రద్దు చేసే దిశలోనే జగన్ సర్కార్ కృతనిశ్చయంతో ఉన్నట్లు స్పష్టమైన సమాచారం. సీఆర్‌డీఏ రద్దు, రాష్ట్రంలో అధికార, పాలనా వికేంద్రీకరణ బిల్లుల వ్యవహారంలో శాసనమండలిలో చోటు చేసుకున్న పరిణామాలతో అధికారపక్షం విస్తుబోయింది. శాసనసభలో 175 స్థానాలలో 151 స్థానాలతో .. 80 శాతంపైగా సభ్యులను కలిగి బిల్లులను ఆమోదిస్తే.. శాసనమండలిలో తిరస్కరణకు గురికావడం సీఎం జగన్‌ని షాక్‌కి గురిచేసింది. వీటి ఫలితంగానే శాసనమండలిని రద్దు చేయాలన్న యోచనలో జగన్‌ ఉన్నారని తెలుస్తోంది. అయితే, దీనిపై మంత్రివర్గంలో తీసుకునే వైఖరికి అనుగుణంగా అసెంబ్లీలో సీఎం తుది నిర్ణయాన్ని ప్రకటిస్తారు.

Loading...
Unable to load recommendations.
Follow Us