Hero Vishal: ఆంధ్రప్రదేశ్‌ 2024 ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గం నుంచి విశాల్ పోటీ..? దీనిపై ఆయన ఏమన్నారంటే..

గత  కొంత కాలంగా టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం నుంచి హీరో విశాల్ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. దీనిపై తాజాగా హీరో విశాల్ స్వయంగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లో జరగబోయే ఎన్నికలలో

Hero Vishal: ఆంధ్రప్రదేశ్‌ 2024 ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గం నుంచి విశాల్ పోటీ..? దీనిపై ఆయన ఏమన్నారంటే..
Hero Vishal
Follow us

|

Updated on: Dec 19, 2022 | 8:18 AM

గత  కొంత కాలంగా టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం నుంచి హీరో విశాల్ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. దీనిపై తాజాగా హీరో విశాల్ స్వయంగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లో జరగబోయే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గం నుంచి తాను పోటీ చేయనున్నట్లు వస్తున్న వార్తలన్నీ కేవలం పుకార్లు మాత్రమేనన్నారు. విశాల్ నటించిన ‘లాఠీ’ మూవీ ప్రమోషన్లకు సంబంధించి చెన్నైలోఆదివారం  ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ఈ క్లారిటీ ఇచ్చారు. కుప్పం విషయంలో వస్తున్న పుకార్లపై ఆయన క్లారిటీ ఇస్తూ..  ‘‘నేను రాజకీయాల్లోకి రావడం ఖాయం. అయితే సామాజిక సేవే ప్రధానంగా ఎన్నికల్లో పోటీ చేస్తాను. కానీ నేను 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గం నుంచి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై పోటీకి దిగుతానని వస్తున్న వార్తల్లో నిజం లేదు. కుప్పం ప్రాంతంలో ఇంతకముందు నా తండ్రి గ్రానైట్‌ వ్యాపారం చేడయం వల్ల మూడేళ్లపాటు అక్కడే ఉన్నాను. అందువల్లనే అక్కడి ప్రజలతో నాకు ఎంతో అనుబంధం ఉంద’’న్నారు.

అయితే ఆరు నెలల క్రితం కుప్పం నుంచి టీడీపీ అధినేత చంద్రబాబుపై  హీరో విశాల్ పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. దీనిపై సోషల్ మీడియాలో కూడా చర్చలు జోరుగా జరిగాయి. విశాల్‌తో వైసీపీ సంప్రదింపులు జరిపిందని అప్పట్లో ఊహాగానాలు బాగానే వినిపించాయి. దీనిపై విశాల్ అప్పుడే స్పందించారు. తాను ఏపీ రాజకీయాల్లోకి వస్తున్నానని.. కుప్పం నుంచి పోటీ చేయబోతున్నాననేది కేవలం ప్రచారం మాత్రమేనన్నారు. సినిమాలో బాగా బిజీగా ఉన్నానని.. చంద్రబాబుపై పోటీ చేయాలనే ఉద్దేశం తనకు లేదని తేల్చి చెప్పారు.

కాగా,  వైసీపీ కూడా ఈ ప్రచారాలను అప్పట్లోనే ఖండించింది. వైసీపీ తరఫున కుప్పం నియోక వర్గం నుంచి ఎమ్మెల్సీ భరత్ నూటికి నూరుశాతం అభ్యర్థిగా ఉంటారని.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపు గెలుపు ఖాయమన్న ధీమాను వ్యక్తం చేశారు ఆ పార్టీ నేతలు. విశాల్ విషయంలో వస్తున్న వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పారు. అయినా ఈ విషయంలో నెట్టింట చర్చలు జరగడంతో తాజాగా విశాల్ మరోసారి నేరుగా స్పందించారు. పోటీ చేయడం లేదన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..