శ్రీ సత్యసాయి జిల్లా ఒడిసి మండలం కొండకమర్ల గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. వివాహితను గొంతు నులిమి ప్రియుడు హత్య చేశాడు. డబురువారిపల్లి చెందిన ఇర్ఫాన్ అనే వ్యక్తితో కొద్ది కాలంగా మెహతాజ్ అనే వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. మెహతాజ్ వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉండడంతో సహించలేని ప్రియుడు ఇర్ఫాన్ ఆమెపై కక్ష పెట్టుకుని ఆమె ఇంటిలోనే గొంతు నులిమి చంపి పరారైయ్యాడు. భర్త బాబ్జాన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితున్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న డీఎస్పీ విజయ్ కుమార్ వివరాలు సేకరిస్తున్నారు.