Road Accident: ఆగిఉన్న లారినీ ఢీకొట్టిన థార్.. స్పాట్‌లోనే నలుగురు మృతి

విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సుందరపేట వద్ద ఆగి ఉన్న ట్యాంకర్‌ను థార్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్పాట్‌లోనే నలుగురు వ్యక్తులు మృతి చెందారు. స్థానికుల సమాచారంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Road Accident: ఆగిఉన్న లారినీ ఢీకొట్టిన థార్.. స్పాట్‌లోనే నలుగురు మృతి
Vizianagaram Road Accident

Updated on: Nov 24, 2026 | 10:18 AM

విజయనగరం జిల్లా సుందరపేట దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న ట్యాంకర్‌ లారీని ఓ థార్ కారు బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న ఓ థార్ కారు వేగంగా వచ్చి రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్యాంకర్‌ను ఢీకొట్టింది. ఢీకొన్న వెంటనే థార్ ఇంజిన్ ముందుభాగం నుంచి మంటలు చెలరేగాయి.

ఈ మంటలు వ్యాపించి కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు మరణించగా, ప్రమాద తీవ్రతకు తీవ్రంగా గాయపడి మరో ఇద్దరు మృతి చెందారు. ప్రమాదాన్ని గమనించిన స్థానిక వాహనదారులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మంటలను ఆర్పివేసి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు.

ఇలా ఉండగా ప్రమాద ధాటికి థార్ కారు పూర్తిగా ఆనవాళ్లు కోల్పోయింది. కారు ముందు భాగమే కాకుండా, వెనుక భాగం కూడా పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. ఇక ఈ ప్రమాదం కారణంగా రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో క్రేన్ సహాయంతో ప్రమాదానికి గురైన వాహనాన్ని పక్కకు తొలగించి పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us