2 నెలల శ్రమ.. రూ.5 లక్షల ఖర్చు.. ఆ ఊరిలో మత్స్యావతారంలో కొలువుదీరిన గణనాథుడు!

వినాయక చవితి వచ్చిందంటే చాలు.. ప్రతి వీధిలో గణనాథుడి సందడే..అయితే.. ఈసారి మాత్రం వినాయక విగ్రహాల ఏర్పాటు ఓ రేంజ్‌లో కనిపిస్తోంది. తమ మండపంలో కొలువుదీరే గణపయ్య.. అందరి గణపయ్యల కంటే కాస్త ప్రత్యేకంగా ఉండాలన్న ఆలోచన.. నిర్వాహకుల్లో కొత్త ఆలోచనలకు తెరతీసింది. దీంతో కళాకారులు సైతం తమ సృజనాత్మకతకు పదును పెట్టారు..

2 నెలల శ్రమ.. రూ.5 లక్షల ఖర్చు.. ఆ ఊరిలో మత్స్యావతారంలో కొలువుదీరిన గణనాథుడు!
Emmiganur Unique Ganesh Idol

Edited By:

Updated on: Sep 14, 2026 | 9:28 AM

కర్నూలు, సెప్టెంబర్ 14: రోజుల తరబడి శ్రమించి.. ఊహకు రూపమిచ్చి.. భక్తిని కళతో మేళవించి సరికొత్త గణనాథుడిని ఆవిష్కరించారు. చూసినవాళ్లంతా ఒక్కసారి ఆగి చూసేలా.. చిన్నారులు ఆసక్తిగా అడిగేలా.. పెద్దలు ఫొటోలు తీసుకునేలా.. ఈ వినాయకుడు ఇప్పుడు ఆ ప్రాంతంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న ఆ గణనాథుడిపై ప్రత్యేక కథనం.

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు లో వినాయక చవితి వచ్చిందంటే చాలు ఆ మండపం వారు ఎటువంటి గణనాధుని ప్రతిష్టిస్తారో ఆ గణనాథుని ఎప్పుడు చూద్దామని ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు. కొండవీటి ప్రాంతంలో గత 36 సంవత్సరాల నుండి వారు ప్రతిష్టించే గణనాథుడను ప్రతి సంవత్సరం పూజకు వినియోగించే వస్తువులతో ఒక్కో వెరైటీతో తయారు చేస్తూ వారు ఓ ప్రత్యేకతను ఏర్పరచుకున్నారు. ఈ సంవత్సరం కూడా చాలా అరుదుగా దొరికే ఆలు చిప్పలు, శంఖలు, గౌమేధికంలతో శ్రీ మత్స్యవతారా రూపంలో గల వినాయక విగ్రహం ను తయారు చేశారు.ఈ సామాగ్రిని మొత్తం కూడా చీరాల, బాపట్ల సముద్ర తీరా ప్రాంతాలు నుండి తెచ్చి ఇక్కడ రెండు నెలలు పాటు శ్రమించి వినాయక విగ్రహం ఏర్పాటు చేశారు. అలాగే ఈ మట్టి గణపతి ను తయారు చేసేందుకు మట్టి ను కూడా నది తిరప్రాంతం ఆయన తుంగభద్ర నది సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రమైన మంత్రాలయం, గురుజాల వంటి దేవాలయాల దగ్గర నుండి మట్టి ను తీసుకోని వచ్చి విగ్రహం తయారు చేశారు.

 

ఇవి కూడా చదవండి

ఈ వినాయక మండలి సభ్యుడు తెలుగు రాముడు మాట్లాడుతూ తాము గత 36 సంవత్సరాల నుండి వినాయక చవితి వేడుకలు జరుపుతున్నామని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో విగ్రహాలు పెట్టడం వల్ల పర్యావరణం దెబ్బతింటుందని, ప్రతి సంవత్సరం మట్టి గణనాధుని ఏర్పాటుచేసి తమవంతుగా పర్యావరణాన్ని కాపాడుతున్నామన్నారు. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా వివిధ సముద్ర తీరల నుండి ఆలు చిప్పలు, శంఖలు, గౌమేధికం లతో మట్టి గణపతిని శ్రీ మత్స్యవతారా రూపంలో, సుమారు రెండు నెలలుగా విగ్రహం తయారు చేస్తునట్టు, ఈ తయారీ విధానం కు ఐదు లక్షల రూపాయలు ఖర్చయిందని వారు తెలిపారు.

Loading...
Unable to load recommendations.
Follow Us