Breaking News
  • ఢిల్లీ: భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. 2 లక్షల 46 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 246628 దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 120406 కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 119293 దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 6929 కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • తిరుపతి: రేపటి నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనాలు ప్రారంభం. ఎనభై రోజుల తరవాత ప్రారంభమవుతున్న దర్శనాలు. రేపు ఎల్లుండి ఉద్యోగులతో ట్రయల్ రన్ ద్వారా దర్శనాలు. పదో తేదీ తిరుమల పై ఉన్న స్థానికులకు దర్శనాలు. 11వతీదీ నుంచి భక్తులకు దర్శనాలు ప్రారంభం. జూన్ నెలకు ఆన్ లైన్ టికెట్ల అమ్మకాలు రేపటి నుంచి టిటిడి వెబ్ సైట్ లో లభ్యం. ఆఫ్ లైన్లో తిరుపతిలోని కౌంటర్లలో టికెట్లు లభ్యం. అలిపిరి నడక మార్గం నుంచి భక్తులు వెళ్లేందుకు అనుమతి. కాణిపాకం దేవాలయంలో రేపటి నుంచి ఉద్యోగులు, స్థానికులతో ట్రయల్ రన్. పదో తేదీ నుంచి గంటకు మూడువందలమంది వరకూ భక్తులకు దర్శనాలు. శ్రీకాళహస్తిలో దేవాలయం రెడ్ జోన్ లో ఉండటం వల్ల ప్రస్తుతానికి దర్శనాలు ప్రారంభించడం లేదని ప్రకటించిన అధికారులు.
  • ఢిల్లీ లో లిక్కర పై ఉన్న స్పెషల్ కరోనా ఫీజు'ను ఉపసంహరించుకోనున్నట్లు కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయం. మద్యంపై గరిష్ట రిటైల్ ధరలో 70% విధించిన స్పెషల్ కరోనా ఫీజు'ను ఉపసంహరించుకోవాలని నిర్ణయం తీసుకున్న ఢిల్లీ ప్రభుత్వం 2020 జూన్ 10 నుంచి అమల్లోకి రానుంది.
  • విశాఖ: లో రౌడీషీటర్ బర్త్ డే సెలబ్రేషన్స్. బౌన్సర్ లతో హల్చల్ చేసిన చిట్టిమాము గ్యాంగ్. పక్కా సమాచారంతో పార్టీ పై రైడ్ చేసిన సిటీ టాస్క్ ఫోర్స్ పోలీసులు. రౌడీషీటర్ చిట్టిమాముతో పాటు పలువురు అరెస్ట్. భారీగా లిక్కర్,గంజాయి,లక్ష50వేలు నగదు స్వాధీనం. దువ్వాడ పోలీసులకు అప్పగించిన సిటీఎఫ్.
  • విజయవాడ: గ్యాంగ్ వార్ కేసులో కొనసాగుతున్న దర్యాప్తు. డీసీపీ హర్షవర్ధన్ ఆధ్వర్యంలో విచారణ.. సందీప్ గ్యాంగ్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు.. 13 మంది నిందితులను విచారిస్తున్న పోలీసులు.. ల్యాండ్ సెటిల్మెంట్ వివాదమే కారణమని గుర్తింపు.. ధనేకుల శ్రీధర్, ప్రతాప్ రెడ్డి డి నాగబాబులను విచారిస్తున్న పోలీసులు.. మంగళగిరి కి చెందిన ఇద్దరు రౌడిసీటర్ల ఉన్నట్టు గుర్తింపు.. టెక్నాలజీ సహాయంతో కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. నిందితుల పండు తల్లిని పాత్రపై విచారిస్తున్న పోలీసులు..
  • అమరావతి: ఈనెల 16 నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం. 18న బడ్జెట్ ప్రవేశపెట్టే ఛాన్స్. కోవిడ్ నేపథ్యంలో 14 రోజులు జరగాల్సిన బడ్జెట్ సమావేశాలు కుదించే అవకాశం. ఈనెల 31తో ముగియనున్న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్.

రివర్స్ టెండరింగ్ గ్రాండ్ సక్సెస్..ఆదా అయ్యింది ఎంతో తెలుసా?

Reverse Tendering in AP, రివర్స్ టెండరింగ్ గ్రాండ్ సక్సెస్..ఆదా అయ్యింది ఎంతో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన రివర్స్ టెండరింగ్ ఊహించని విధంగా సత్ఫలితాలను ఇస్తోంది. తొలిసారిగా పోలవరం ప్రాజెక్ట్‌లోని 65 ప్యాకేజి పనికి టెండర్ పిలవగా అంచనా వ్యయం కన్నా 15.6 శాతం తక్కువకు అంటే.. మొత్తం పని విలువలో 43 కోట్ల తక్కువకు మ్యాక్స్ ఇన్‌ఫ్రా.. ఎల్-1గా బిడ్ దాఖలు చేసినట్లుగా తెలిసింది. గత టిడిపి ప్రభుత్వంలో ఇదే ప్యాకేజీని 292.02 కోట్లకు ఇప్పుడు దక్కించుకున్న మ్యాక్స్ ఇన్‌ఫ్రానే సొంతం చేసుకుంది.  దానిని రద్దు చేసిన వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కొత్తగా టెండర్లకు ఆహ్వనించింది. తాజా బిడ్డింగ్‌తో ఏపీ ప్రభుత్వానికి రూ58.53 కోట్లు ఆదా కానుంది. కేవలం మూడు వందల కోట్ల పనిలోనే రివర్స్ టెండరింగ్‌లో ఇంత ఆదా ఉంటే భవిష్యత్తులో ఖరారు కానున్న హైడల్, హెడ్వరిస్క్ సంబంధించిన పనుల్లో ఎంత మొత్తం ఆదా అవుతుందో ఊహించుకోవచ్చు.

సాధారణంగా ఎల్-1గా వచ్చిన సంస్థకు పనిని అప్పగిస్తూ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటుంది. అయితే రివర్స్ టెండరింగ్లో ఎల్-1గా వచ్చిన సంస్థ ధరను బేసిక్ బెంచ్ మార్క్‌గా ప్రకటించి దాని ఆదారంగా మరింత తక్కువకు సంస్థలు టెండర్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. దాంతో తొలుత పిలిచిన 65వ ప్యాకేజీలోని పనికి 15.6 శాతం తక్కువకు మ్యాక్స్ ఇన్‌ఫ్రా బిడ్డు దాఖలు చేసింది. మిగిలిన సంస్థకన్నా ఇది బాగా తక్కువ కావడంతో ఈ సంస్థకు పనిని అప్పగించే అవకాశాలు ఉన్నాయి.

శుక్రవారం ఉదయం 11 గంట నుంచి ఈ-ఆక్షన్ (రివర్స్ టెండరింగ్) నిర్వహించారు. ఇందులో ఆరు సంస్థలు పోటీపడ్డాయి. రెండు గంటల 45 నిమిషాల పాటు ఈ-ఆక్షన్ నిర్వహించారు. అత్యంత తక్కువకు బిడ్ వేసిన సంస్థ అర్హతలను పరిశీలించి పనులు అప్పగించే అవకాశం ఉంది. దేశంలో ఎక్కడాలేని రీతిలో రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా రివర్స్ టెండరింగ్ చేపట్టడం ఇదే తొలిసారి. ఇందులో ఆరు బడా సంస్థలు పోటీపడటాన్ని బట్టి చూస్తే.. కాంట్రాక్టు విలువ కంటే అత్యంత తక్కువ ధరకు టెండర్ ఖరారయ్యే అవకాశం ఉందని దీనివల్ల పెద్ద మొత్తంలో నిధులు ఆదా అవుతాయని జలవనరులశాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు.

Related Tags