నిధుల లేమి.. జగన్ సర్కార్‌కు భారీ ఊరట

ఓ వైపు నిధుల కొరతతో అలమటిస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కార్‌కు భారీ వెసులుబాటు లభించింది. రాష్ట్రంలో భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్‌ల నిర్మాణం కోసం రూ.6వేల కోట్ల రుణ సాయం అందించేందుకు అంతర్జాతీయ న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్(ఎన్‌డీబీ) ముందుకు వచ్చింది. గురువారం జగన్‌తో భేటి అయిన బ్యాంకు ప్రతినిధులు ఈ మేరకు తమ అంగీకారం తెలిపారు. జగన్‌తో సమావేశమైన వారిలో ఎన్‌డీబీ వైస్ ఛైర్మన్ ఎన్.జోంగ్, ప్రాజెక్ట్ హెడ్ రాజ్ పుర్కర్ ఉన్నారు. అయితే […]

నిధుల లేమి.. జగన్ సర్కార్‌కు భారీ ఊరట
Follow us

| Edited By:

Updated on: Sep 06, 2019 | 8:20 AM

ఓ వైపు నిధుల కొరతతో అలమటిస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కార్‌కు భారీ వెసులుబాటు లభించింది. రాష్ట్రంలో భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్‌ల నిర్మాణం కోసం రూ.6వేల కోట్ల రుణ సాయం అందించేందుకు అంతర్జాతీయ న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్(ఎన్‌డీబీ) ముందుకు వచ్చింది. గురువారం జగన్‌తో భేటి అయిన బ్యాంకు ప్రతినిధులు ఈ మేరకు తమ అంగీకారం తెలిపారు. జగన్‌తో సమావేశమైన వారిలో ఎన్‌డీబీ వైస్ ఛైర్మన్ ఎన్.జోంగ్, ప్రాజెక్ట్ హెడ్ రాజ్ పుర్కర్ ఉన్నారు.

అయితే విభజన తర్వాత నుంచి నిధుల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది ఏపీ ప్రభుత్వం. దీంతో రాష్ట్రంలో మౌలిక సౌకర్యాల కల్పనపై డబ్బును వెచ్చించలేని పరిస్థితి నెలకొంది. ఈ సమయంలో రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో మౌలిక సౌకర్యాల ప్రాజెక్ట్‌ల నిర్మాణం కోసం సాయం అందించేందుకు న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు ముందుకొచ్చింది. రాష్ట్రంలో మౌలిక సౌకర్యాల అభివృద్ధికి మొత్తం రూ.25వేల కోట్లు ఖర్చు అవుతాయని బ్యాంకు ప్రతినిధులకు సీఎం జగన్ ప్రతిపాదించగా.. రూ.6వేల కోట్లు ఇచ్చేందుకు వారు అంగీకరించారు. ఇక ఈ అంశాన్ని బ్యాంకు బోర్డు ఆమోదిస్తే.. ఆ తరువాత రాష్ట్రానికి నిధులు విడుదల కానున్నాయి. ఇక ఈ బ్యాంకు అందించే రుణాన్ని తిరిగి చెల్లించేందుకు 32 సంవత్సరాల గడువు ఇచ్చారు. మౌలిక సౌకర్యాల కల్పనలో భాగంగా పాఠశాల భవనాలు, ఆసుపత్రుల నిర్మాణం, సురక్షిత తాగునీటి సరఫరా వసతుల కల్పనకు ఈ నిధులు ఖర్చు చేస్తారు. అయితే ఇప్పటికే ప్రపంచ బ్యాంకు, ఆసియా పారిశ్రామిక, మౌలిక వసతుల బ్యాంకు.. అమరావతి నిర్మాణం కోసం గతంలో ప్రతిపాదించిన 700మిలియన్ డాలర్ల సాయాన్ని వెనక్కి తీసుకున్న నేపత్యంలో ఎన్‌డీబీ నిర్ణయం జగన్ ప్రభత్వానికి భారీ ఊరటనే చెప్పొచ్చు.