నా చేతులు నరికేయండి..

కొన్ని వ్యాధులు చికిత్సకు కూడా అందవు. కొంతమంది ఎవ్వరికీ రాని అరుదైన వ్యాధులు సోకుతాయి. వాటితో జీవితాంతం నరకాన్ని అనుభవిస్తుంటారు. పుట్టినప్పుడు బాగానే ఉండి.. ఎదుగుతున్న కొద్దీ శరీరంలో వచ్చిన మార్పులతో చిత్రవధను భరిస్తుంటారు. ఓ వ్యక్తికి ప్రపంచంలోనే ఎవ్వరికీ రాని అరుదైన వ్యాధి సోకింది. బంగ్లాదేశ్‌కు చెందిన అబుల్ బజందర్ అనే ఇరవైయ్యేళ్ల వ్యక్తి గత ఇరవై ఏళ్లనుంచి ఎపిడెర్మో డిస్ప్లసియా వెరుసిఫోర్మిస్( ఈవీ ) అనే వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ వ్యాధినే ట్రీ మాన్ […]

నా చేతులు నరికేయండి..
Follow us

| Edited By:

Updated on: Jun 25, 2019 | 6:35 PM

కొన్ని వ్యాధులు చికిత్సకు కూడా అందవు. కొంతమంది ఎవ్వరికీ రాని అరుదైన వ్యాధులు సోకుతాయి. వాటితో జీవితాంతం నరకాన్ని అనుభవిస్తుంటారు. పుట్టినప్పుడు బాగానే ఉండి.. ఎదుగుతున్న కొద్దీ శరీరంలో వచ్చిన మార్పులతో చిత్రవధను భరిస్తుంటారు. ఓ వ్యక్తికి ప్రపంచంలోనే ఎవ్వరికీ రాని అరుదైన వ్యాధి సోకింది. బంగ్లాదేశ్‌కు చెందిన అబుల్ బజందర్ అనే ఇరవైయ్యేళ్ల వ్యక్తి గత ఇరవై ఏళ్లనుంచి ఎపిడెర్మో డిస్ప్లసియా వెరుసిఫోర్మిస్( ఈవీ ) అనే వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ వ్యాధినే ట్రీ మాన్ సిండ్రోమ్ అని కూడా పిలుస్తారు. దీనివల్ల అతడి కాళ్లు, చేతుల్లో చెట్ల వేర్లు మొలిచినట్టుగా విస్తరించడంతో ప్రతిరోజు ఆ బాధతో కూడిన విపరీతమైన నొప్పిని భరించలేక పోతున్నానని దయచేసి తన చేతులను నరికి వేయాలని వైద్యులను కోరుకుంటున్నాడు.

అయితే ఈ వ్యాధి తల్లిదండ్రులనుంచి చెరొక ఈవీ జన్యువు కలిసి ఈవీగా మారడంతో ఈ వింతవ్యాధి వస్తుందని వైద్యులు నిర్ధారించారు. ఇటువంటి వ్యాధిగ్రస్తులు ప్రపంచంలో ఐదుగురు ఉన్నట్టుగా అంచనావేస్తున్నారు. ఈ భయంకరమైన వ్యాధి వంశపారంపర్యంగా తరువాత సంతానానికి కూడా వచ్చే అవకాశాలున్నాయంటున్నారు. ఇదిలా ఉంటే ఈ వ్యాధి గ్రస్తుల్లో దాదాపు 10 శాతం మందికి తల్లిదండ్రులు రక్త సంబంధీకులేనని తేలింది. అయితే పుట్టగానే ఈ వ్యాధి లక్షణాలు బయటపడవని, ఎదురుగుతున్న క్రమంలో ఐదు నుంచి 11 ఏళ్ల మధ్యలో ఇవి బయటపడతాయని వైద్యుల పరిశోధనలో తేలింది. మరోవైపు తన బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్ధం కావడంలేదని కన్నీరు పెట్టుకుంటున్నాడు అబుల్. తన రెండు చేతుల్ని నరికివేయాలని వేడుకుంటున్నాడు. తనలాంటి వ్యాధి ఎవ్వరికీ రాకూడదంటున్నాడు అబుల్ బజేందర్.