US Bans Dogs: ఒక వైపు కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తుండగా, మరో వైపు కుక్కలకు వచ్చే రేబిస్ వ్యాధి ప్రమాదకరంగా మారుతోంది. దాదాపు వంద దేశాల్లో రేబిస్ వ్యాధి సమస్య పెరిగిపోతోంది. అయితే ఈ కుక్కల దిగుమతిపై అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా దేశాల నుంచి తీసుకొచ్చే కుక్కలపై ఏడాది పాటు నిషేధం విధిస్తూ ఆ దేశ ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పెంపుడు కుక్కలు లేదా అమ్మకం, దత్తత ద్వారా దేశంలోకి తీసుకువచ్చే కుక్కలపై ఈ నిషేధం విధించింది. అయితే ఇప్పటికే దేశంలోకి తీసుకొచ్చిన కుక్కలకు రేబిస్ వ్యాక్సినేషన్ జరిగినట్లు తగిన ఆధారాలు చూపించాల్సి ఉంటుంది.
పూర్తిగా వ్యాక్సినేషన్ చేయడానికి తగినంత వయసు లేనప్పటికీ తప్పుడు ధృవపత్రాలు చూపించి వాటిని దేశంలోకి తీసుకొస్తున్నారని, అందుకే విదేశాల నుంచి తీసుకువస్తున్న ఈ కుక్కలపై నిషేధం విధించినట్లు పేర్కొంది. జూలై 14 నుంచి ఈ నిషేధం అమల్లోకి వస్తుందని సెంట్రల్ ఫర్ డిసీజ్ కంట్రోల్అండ్ప్రివెన్షన్(CDC) ఈ ప్రకటన జారీ చేసింది.
కాగా, అమెరికాకు ప్రతి యేటా సుమారు 10 లక్షల కుక్కలు దిగుమతి అవుతుంటాయని సీడీసీ అధికారులు తెలిపారు. వీటిలో దాదాపు 4 శాతం నుంచి 7.5 శాతం కుక్కలపై ఈ నిషేధం ఎఫెక్ట్ ఉంటుందని అధికారులు వెల్లడించారు. అయితే కొన్ని పరిస్థితుల్లో ఈ ఆంఓలను సడలిస్తామన్నారు. అంధులకు దారి చూపే గైడ్ కుక్కలకు, అమెరికాకు తమ కుక్కలతో పాటు మారుతున్న విదేశీలకు ఈ మినహాయింపు ఉంటుందని తెలిపారు. కాగా, ఇటీవల తిరస్కరణ అయిన కుక్కల్లో ఎక్కువగా రష్యా, ఉక్రెయిన్, కొలంబియా నుంచి దిగుతమతి చేసుకున్నవే ఉన్నాయని అధికారులు తెలిపారు.