అమెరికాలో విదేశీ శాస్త్రవేత్తలకు డాలర్ల పంట.. ట్రంప్ సర్కార్ ప్రతిపాదన

అమేరికాలో హెచ్ 1 బీ, ఎల్ 1 వీసాల జారీ ప్రక్రియలో సంస్కరణలు తెచ్చేందుకు బిల్లును రూపొందించిన ట్రంప్ ప్రభుత్వం.. మరో కొత్త ప్రతిపాదన తెస్తోంది. హెచ్-1 బీ స్టేటస్ లో విదేశీ శాస్త్రవేత్తలకు ఏడాదికి లక్షా యాభై వేల డాలర్ల నుంచి రెండు లక్షల యాభై వేల డాలర్ల మేర కనీస వేతనాలను ఆయా కంపెనీలు చెల్లించాలన్న ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్టు సమాచారం. అంటే ఎక్కువ వేతనాలు పొందని హెచ్ 1 బీ వీసా హోల్డర్ల ఎంట్రీని […]

అమెరికాలో విదేశీ శాస్త్రవేత్తలకు డాలర్ల పంట.. ట్రంప్ సర్కార్ ప్రతిపాదన
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 24, 2020 | 2:36 PM

అమేరికాలో హెచ్ 1 బీ, ఎల్ 1 వీసాల జారీ ప్రక్రియలో సంస్కరణలు తెచ్చేందుకు బిల్లును రూపొందించిన ట్రంప్ ప్రభుత్వం.. మరో కొత్త ప్రతిపాదన తెస్తోంది. హెచ్-1 బీ స్టేటస్ లో విదేశీ శాస్త్రవేత్తలకు ఏడాదికి లక్షా యాభై వేల డాలర్ల నుంచి రెండు లక్షల యాభై వేల డాలర్ల మేర కనీస వేతనాలను ఆయా కంపెనీలు చెల్లించాలన్న ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్టు సమాచారం. అంటే ఎక్కువ వేతనాలు పొందని హెచ్ 1 బీ వీసా హోల్డర్ల ఎంట్రీని మినిమమ్ స్థాయిలో నిరోధిస్తూనే ఇందుకు శ్రీకారం చుట్టాలన్నది ట్రంప్ ప్రభుత్వ ధ్యేయంగా కనబడుతోంది, వీరి కనీస వేతనాలను లెవెల్-4 స్థాయి వేతనాలుగా పరిగణించవచ్ఛు.(ఈ విధంగా ప్రస్తుతం వేతన ప్రాతిపదికను నిర్దేశించారు). ఈ నాలుగో స్థాయి వేతన జీవులు ఎవరంటే.. ఫైనాన్షియల్ మేనేజర్లు (వీరికి వార్షిక వేతనం రెండున్నర లక్షల డాలర్ల పైమాటే), మార్కెటింగ్ మేనేజర్లు (వీరికి రెండు లక్షల ఇరవై ఏడు వేల డాలర్లు), సాఫ్ట్ వేర్ డెవెలపర్లు (వీరికి లక్షా 44 వేల 976 డాలర్లుగా నిర్దేశించారు. అయితే ఈ ప్రతిపాదనలో పలు సమస్యలను విశ్లేషకులు గుర్తించారు. ప్రస్తుత హెచ్-1 బీ వీసా హోల్డర్లలో సుమారు 5 శాతం మాత్రమే నాలుగో స్థాయి వేతనాలు పొందుతున్నారని వైట్ హౌస్ అడ్వైజర్ స్టీఫెన్ మిల్లర్ గతంలోనే పేర్కొన్నారు. కాగా తాజా ప్రతిపాదన ప్రకారం.. అమెరికాలో పని చేస్తున్న ఈ వీసా హోల్డర్లలో 95 శాతం మందిని ఎలిమినేట్ చేయాలన్నదేనట..

ఇక యుఎస్ చట్ట సభల్లో ప్రవేశ పెట్టిన బిల్లులో దేశంలో చదివిన విదేశీయులకే హెచ్-1 బీ వీసాల జారీలో తొలి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందన్నది ప్రధానమైనది. అమెరికన్లకు దక్కాల్సిన ఉద్యోగాలను హెచ్-1 బీ, ఎల్ 1  వీసా హోల్డర్లతో భర్తీ చేయడాన్ని నిషేధించాలన్న ప్రతిపాదనను కూడా ఇందులో పొందుపరిచారు.

శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..