ప్రధాని మోదీతో కలిసి పనిచేస్తామన్న ట్రంప్

భారత్- అమెరికా కలల సాకారం కోసం ప్రధాని మోదీతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నారు. అమెరికాలోని హ్యూస్టన్‌ వేదికగా ఏర్పాటు చేసిన ‘హౌడీ- మోదీ’ కార్యక్రమంలో ట్రంప్ర పాల్గొన్నారు. ప్రధాని మోదీ స్వాగత ప్రసంగం అనంతరం అధ్యక్షుడు ట్రంప్ “హౌడీ-మోదీ” కార్యక్రమానికి హాజరైన ప్రవాస భారతీయులనుద్దేశించి ప్రసంగించారు. తనను ఆహ్వానించిన హ్యూస్టన్ వాసులకు, ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెల్పారు ట్రంప్. కొద్ది రోజుల క్రితమే మోదీ ఎన్నికల్లో ఘన […]

ప్రధాని మోదీతో కలిసి పనిచేస్తామన్న ట్రంప్
Follow us

| Edited By:

Updated on: Sep 23, 2019 | 1:23 AM

భారత్- అమెరికా కలల సాకారం కోసం ప్రధాని మోదీతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నారు. అమెరికాలోని హ్యూస్టన్‌ వేదికగా ఏర్పాటు చేసిన ‘హౌడీ- మోదీ’ కార్యక్రమంలో ట్రంప్ర పాల్గొన్నారు. ప్రధాని మోదీ స్వాగత ప్రసంగం అనంతరం అధ్యక్షుడు ట్రంప్ “హౌడీ-మోదీ” కార్యక్రమానికి హాజరైన ప్రవాస భారతీయులనుద్దేశించి ప్రసంగించారు. తనను ఆహ్వానించిన హ్యూస్టన్ వాసులకు, ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెల్పారు ట్రంప్. కొద్ది రోజుల క్రితమే మోదీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాదు ఇటీవల ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా మరోసారి హూస్టన్ వేదికగా మోదీకి బర్త్ డే విషెస్ చెప్పారు. ఈ చారిత్రక సమావేశానికి రావడం అదృష్టంగా భావిస్తున్నానన్న ట్రంప్.. ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. మోదీ బాగా పనిచేస్తున్నారని.. భారత్‌‌ో 30 కోట్ల మంది భారతీయుల్నిపేదరికం నుంచి దూరం చేశారని అన్నారు. అంతేకాదు.. 40 కోట్ల మంది మధ్య తరగతి ప్రజలు భారత్ ఆస్తి అన్నారు. ప్రస్తుతం అమెరికా- భారత్ మైత్రి మరింత బలపడుతుందని.. ఇరు దేశాల మధ్య మైత్రీబంధానికి ఈ సమావేశం నిదర్శనమని అన్నారు. అమెరికా అభివృద్ధిలో ప్రవాస భారతీయుల పాత్ర కీలకమని ట్రంప్ అన్నారు. అమెరికాలో నాలుగేళ్లలో నిరుద్యోగాన్ని బాగా తగ్గించామన్నారు. యువతకు కొత్త ఉద్యోగాలు వస్తున్నాయని గుర్తు చేశారు. ఇరుదేశాల ప్రజాస్వామ్యాలు ప్రపంచానికి మార్గనిర్దేశనం చేస్తున్నాయన్నారు. అమెరికాలో ఆర్థిక అసమానతలు వేగంగా తగ్గుతున్నాయని.. నాలుగేళ్లలో కోటీ 40లక్షల మందికి కొత్త ఉద్యోగాల కల్పన జరిగిందని ట్రంప్ అన్నారు. భారత్‌- అమెరికాలు రక్షణ ఉత్పత్తుల భాగస్వాములుగా మారుతున్నాయని.. సరిహద్దు భద్రత అనేది భారత్‌, అమెరికాకు అత్యంత ప్రాధాన్యత అంశమని అన్నారు. సరిహద్దు భద్రత అంశంలో భారత్‌కు సహకరిస్తామని ట్రంప్ స్పష్టం చేశారు. ఇక్కడి ప్రజాప్రతినిధులంతా హ్యూస్టన్‌ బలోపేతానికి ప్రయత్నిస్తున్నారని.. ఈ సభకు 50 వేల మంది రావడం అత్యంత స్ఫూర్తిదాయకమని అన్నారు.

Latest Articles
కొత్త మట్టి పాత్రలు కొన్నారా.. వెంటనే ఈ పనులు చేయండి..
కొత్త మట్టి పాత్రలు కొన్నారా.. వెంటనే ఈ పనులు చేయండి..
ఆర్జీవీ ఏమాయ చేసాడో.. ఆరాధ్యదేవి మరింత అందంగా..
ఆర్జీవీ ఏమాయ చేసాడో.. ఆరాధ్యదేవి మరింత అందంగా..
ఒక్క పోస్ట్‌తో స్కామర్‌కు చుక్కలు.. నెంబర్ సహా 20 ఫోన్లు బ్లాక్
ఒక్క పోస్ట్‌తో స్కామర్‌కు చుక్కలు.. నెంబర్ సహా 20 ఫోన్లు బ్లాక్
ఓట్ల కోసం నేతల పాట్లు - గెలుపు మాదంటే మాదని ధీమా!
ఓట్ల కోసం నేతల పాట్లు - గెలుపు మాదంటే మాదని ధీమా!
టీమిండియా టీ20 ప్రపంచకప్ జెర్సీ ధరెంతో తెలుసా?ఎక్కడ దొరుకుతాయంటే?
టీమిండియా టీ20 ప్రపంచకప్ జెర్సీ ధరెంతో తెలుసా?ఎక్కడ దొరుకుతాయంటే?
ప్రపంచంలోనే ఫస్ట్ సీఎన్‌జీ బైక్.. లాంచింగ్‌కు ముహూర్తం ఫిక్స్..
ప్రపంచంలోనే ఫస్ట్ సీఎన్‌జీ బైక్.. లాంచింగ్‌కు ముహూర్తం ఫిక్స్..
బీరు తాగేటప్పుడు ఈ ఆహారపదార్ధాలు తింటే ఇక మీ ఆరోగ్యం షెడ్డుకే..
బీరు తాగేటప్పుడు ఈ ఆహారపదార్ధాలు తింటే ఇక మీ ఆరోగ్యం షెడ్డుకే..
ఛీ.. ఛీ.. అమ్మాయే అబ్బాయికి ముద్దు పెట్టింది.. చర్యలు తీసుకోండి..
ఛీ.. ఛీ.. అమ్మాయే అబ్బాయికి ముద్దు పెట్టింది.. చర్యలు తీసుకోండి..
ఆమె నవ్వుకు పడిపోవాల్సిందే..సీనియర్ నటి ఊర్వశి కూతురిని చూశారా ?.
ఆమె నవ్వుకు పడిపోవాల్సిందే..సీనియర్ నటి ఊర్వశి కూతురిని చూశారా ?.
ఇప్పుడు జనాలకి నువ్వు కావాలి.. పవన్ కోసం కదిలిన టాలీవుడ్ హీరోలు
ఇప్పుడు జనాలకి నువ్వు కావాలి.. పవన్ కోసం కదిలిన టాలీవుడ్ హీరోలు