అమెజాన్, గూగుల్‌లకు షాకిచ్చిన కేంద్రం.. 72 గంటల డెడ్‌లైన్‌..

చైనా యాప్‌లపై నిషేదించిన విధించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ-కామర్స్ దిగ్గజాలైన గూగుల్, అమెజాన్‌లకు భారీ షాక్ ఇస్తూ.. డెడ్‌లైన్‌ను విధించింది.

అమెజాన్, గూగుల్‌లకు షాకిచ్చిన కేంద్రం.. 72 గంటల డెడ్‌లైన్‌..
Follow us

|

Updated on: Jul 07, 2020 | 5:57 PM

చైనా యాప్‌లపై నిషేదించిన విధించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ-కామర్స్ దిగ్గజాలైన గూగుల్, అమెజాన్‌లకు భారీ షాక్ ఇస్తూ.. డెడ్‌లైన్‌ను విధించింది. గత రెండేళ్లుగా ఈ-కామర్స్ పాలసీ ముసాయిదాపై కసరత్తులు చేస్తున్న ప్రభుత్వం.. తాజాగా దాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ఆయా కంపెనీలను నిబంధనలు పాటించమంటూ.. తమ దగ్గర ఉన్న వినియోగదారుల డేటాను 72 గంటలలోపు సమర్పించాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఇండియాలో గడిచిన కొన్నేళ్లుగా అమెజాన్, గూగుల్ వంటి దిగ్గజ ఈ కామర్స్ వెబ్‌సైట్‌ల జోరు ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా అటు దేశీయ కంపెనీల వేగంగా ఒక్కసారిగా తగ్గిపోయింది. దీన్ని గ్రహించిన కేంద్రం.. ఆ దిశగా చర్యలు తీసుకుంది. ఈ-కామర్స్ రెగ్యులేటర్‌ను నియమించి.. విదేశీ కంపెనీలకు కళ్లెం వేసింది. కాగా, కరోనా పుణ్యమా అని తాజాగా డిజిటల్ చెల్లింపులు ఎక్కువయ్యాయి. అంతేకాకుండా భారతీయులు ఈ మధ్యకాలంలో వాడే యాప్‌లు ఎక్కువగా విదేశాలకు చెందినవే. అందువల్ల డిజిటల్ మోసాలతో పాటు కస్టమర్ల వివరాలు బహిర్గతం కాకుండా ఉండేందుకు కేంద్రం ఈ దిగ్గజ కంపెనీలకు అల్టిమేటం జారీ చేసింది. దీనిపై ఆయా సంస్థలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి.