ఆమంచి వర్సెస్ కరణం

Amanchi vs Karanam

ఎమ్మెల్యేగా పోటీ చేశారు.. ఓడిపోయారు.. ఇదో పెద్ద విషయా చెప్పండి… ఓడి పోయినవాళ్లకి వాల్యూ ఎవరిస్తారండీ.. అంటారా.. మీరనేది కరెక్టే.. కానీ అక్కడ మాత్రం సీన్ రివర్స్ లో ఉంది మరి. ఏపీ ఎలక్షన్ వార్ లో ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గం చుట్టూ రాజకీయం వాడి వేడిగా సాగింది. ఎందుకంటే ఎన్నికల ముందు వరకు చీరాల అంటే గుర్తొచ్చేది ఆమంచి కృష్ణమోహన్. కానీ ఎన్నికలకు తెర లేవగానే ఆమంచి వర్సెస్ కరణం ఎపిసోడ్ గా మారిపోయింది చీరాల. ఇద్దరూ మాంచి మాస్ లీడర్లు కావడంతో పోరు ఓ రేంజ్ లో సాగింది. చివరికి కరణం బలరాంని విజయం వరించింది .

అయినా ఆ నియోజకవర్గంలోని ప్రజలు మాత్రం ఆమంచితోనే మాకు మంచి అంటూ కృష్ణమోహన్ చుట్టూ తిరుగుతున్నారు. తమకు ఏ పనులు కావాలన్నా ఆమంచి తలుపు తడుతున్నారు. దానికి తోడు అధికారులకు కూడా తాను చెప్పిన మాటే వినాలని ఆమంచి హుకుం జారీ చేశారు. దాంతో ఎమ్మెల్యే కరణం బలరాం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తన మాట వినకపోతే ప్రభుత్వ కార్యాలయాలముందు ధర్నా చేస్తానని అధికారులకు వార్నింగ్ ఇస్తున్నారు పాపం కరణం. అయినా ఆయననెవరూ పట్టించుకోవడంలేదు. దాంతో ప్రతిపక్షంలో ఉన్నవాళ్లు గెలిస్తే మాత్రం ప్రయోజనమేంటి.. ఓడినా పార్టీ పవర్ లో ఉంది కనుక ఆమంచికి తిరుగులేకుండా పోయిందని రాజకీయవర్గాల్లో చర్చలు సాగుతున్నాయి.

ఈమధ్య గ్రామ సచివాలయ వాలంటీర్ల ఎంపిక విషయంలో కూడా వీరిద్దరి మధ్య నిప్పు రాజుకుందని తెలుస్తోంది. ఆమంచి సిఫార్స్ చేసిన వారిని వాలంటీర్లుగా ఎలా ఎంపికచేస్తారంటూ అధికారులపైన ఫైర్ అయ్యారట కరణం బలరాం. తమ వర్గీయులకు కూడా వాలంటీర్ పోస్ట్ లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దాంతో.. ఆమంచి నియోజకవర్గంలో కరణం దౌర్జన్యాలు ఎక్కువైపోయాయంటూ మంత్రి బాలినేనికి ఫిర్యాదు చేశారట ఆమంచి. అయితే ఓడిన వ్యక్తి మాటలు ఎలా వింటారంటూ అధికారులమీద భగ్గుమన్నారట కరణం. ఇదండీ..చీరాల పొలిటికల్ స్క్రీన్ మీద వాడి వేడిగా సాగుతున్న నువ్వా, నేనా అనే ఎపిసోడ్.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *