Breaking News
  • విజయవాడ: ప్రకాశం బ్యారేజ్‌ దగ్గర ఉద్రిక్తత. ధర్నాచౌక్‌ నుంచి మందడం బయల్దేరిన కర్నాటక రైతులు. అనుమతిలేదంటూ ప్రకాశం బ్యారేజ్‌ దగ్గర అడ్డుకున్న పోలీసులు.
  • చంద్రబాబుతో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ భేటీ. అమరావతి కార్యాచరణపై చర్చ.
  • మైలవరం ఫారెస్ట్ అధికారిపై వైసీపీ మండలాధ్యక్షుడు దాడికియత్నం. అటవీ భూమిని చదును చేస్తుండగా అడ్డుకున్న ఫారెస్ట్ అధికారి . ఫారెస్ట్‌ అధికారితో వాదనకు దిగిన వైసీపీ నేత పామర్తి శ్రీను.
  • ప.గో: చంద్రబాబుది యూటర్న్‌ గవర్నమెంట్‌ అయితే.. జగన్‌ది రద్దుల గవర్నమెంట్‌. మంగళగిరిలో లోకేష్‌ ఓడిపోయి.. మండలిలోకి వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాలు అడుకుంటున్నారు. రాజకీయ పునరావాసానికి మండలి వేదికగా మారింది-బీజేపీ నేత అంబికా కృష్ణ.
  • తూ.గో: తునిలో కారులో ఇరుక్కున్న మూడేళ్ల బాలుడు. మూడేళ్ల బాబును కారులో వదిలి వెళ్లిన తల్లిదండ్రులు. కారు డోర్లు లాక్‌ కావడంతో ఉక్కిరిబిక్కిరైన బాలుడు. కారు అద్దాలు పగలగొట్టి చిన్నారిని కాపాడిన స్థానికులు.

ఎలక్ట్రిక్ స్కూటర్స్‌తో జర భద్రం

, ఎలక్ట్రిక్ స్కూటర్స్‌తో జర భద్రం

ఎలక్ట్రిక్ స్కూటర్లపై తాజాగా.. అమెరికాకు చెందిన కొంతమంది పరిశోధకులు రీసెర్చ్ చేశారు. అందులో భాగంగా.. అమెరికాలోని ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ వినియోగించే వారు ఎందుకు ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నారే అనే విషయంపై రీసెర్చ్ నిర్వహించారు.

దాదాపు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను వినియోగించే వారిలో 98 శాతం మంది ప్రమాదానికి గురవుతున్నవారే. చట్టవిరుద్ధంగా వీరిలో చాలా మంది హెల్మెట్స్ ధరించకుండా, మద్యపానం చేసి రైడ్ చేసే వారు ఎక్కువుగా ఉన్నట్లు అమెరికా పరిశోధకులు తెలిపారు.

శాన్ డియాగో మెడికల్ సెంటర్ (సీడీసీ) ఎలక్ట్రిక్ స్కూటర్ల రైడర్స్‌కి ఎందుకు గాయాలపాలవుతున్నారో.. అనేవాటిపై అధ్యయనం రూపొందించింది. గత సంవత్సరం ఈ సంస్థ ఆస్టిన్, టెక్సాస్‌లో జరిగిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ ప్రమాదాలపై పరిశోధన నిర్వహించింది.

, ఎలక్ట్రిక్ స్కూటర్స్‌తో జర భద్రం

అయితే.. వీరు ఎక్కువగా వాహనాలను ఢీకొని, ఘర్షణ పడి, ప్రమాదాలకు గురయ్యే సంఘటనలు చాలా అరుదని తెలిపారు. ఎక్కువగా మద్యం సేవించి రైడ్ చేయడం వలన, అలాగే.. హెల్మెట్స్ లేకుండా రైడ్ చేయడం వలన ఎక్కువ ప్రమాదాలకు గురవుతున్నారని చెప్పారు. దీంతో వారు ఎక్కువ గాయాలపాలవుతున్నారని తెలియజేశారు. సీడీసీ సేకరించిన డేటా ప్రకారం.. మేము తీవ్రంగా ఈ సమస్యను నిర్మూలించడానికి ప్రయత్నిస్తున్నామని, దీనిపై ఇప్పటికే పలు పరిష్కారాలు కూడా చూపించామని ఒక లైమ్ ప్రతినిధి సీఎన్బీసీకి వివరించారు.

ప్రజలు ఎల్లప్పుడూ రహదారులపై తప్పులు చేస్తూనే ఉంటారు. వారికి సరైన అవగాహనను ఏర్పరిచితే ఈ ప్రమాదాలు తగ్గుతాయని తెలిపారు. అలాగే.. కన్స్యూమర్ (వినియోగదారుల చట్టం) స్కూటర్ ప్రమాదాల గురించి ఒక అధ్యయనాన్ని నిర్వహించారు. ఇందులో ఏటా 1500 మంది ఈ ప్రమాదాలకు గురవుతున్నారని నివేదికలో వెల్లడైంది. చిన్న, దగ్గర ప్రయాణాలకు వీటి సౌకర్యం బావుటుందని ప్రజలు దీనిపై ఎక్కువ మక్కువ చూపుతున్నారని తేలింది. అద్దెకు కూడా బ్యాటరీతో నడిచే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు అన్ని ప్రదేశాల్లో లభ్యమవుతాయి కాబట్టి ప్రజలు వీటిని ఎక్కువగా ఇష్టపడుతున్నారని చెప్పారు.

, ఎలక్ట్రిక్ స్కూటర్స్‌తో జర భద్రం

ఒక మీడియా ప్రకారం.. 21 ఏళ్ల ఉన్న ఒక అబ్బాయి ఈ స్కూటర్ డ్రైవ్ చేస్తూ కారును గుద్దుకుని మరణించాడని పేర్కొన్నారు. అతనికి తల, చేతులు, మోకాళ్లు, ఇతర భాగాల్లో బాగా గాయాలు అయ్యాయని ప్రచురించారని.. కన్స్యూమర్ సంస్థ తెలిసింది.

ఈ స్కూటర్ సంస్థలు ప్రజలు హెల్మెట్‌ను ధరించాలని చెప్పినప్పటికీ కొంతమంది వీటిని పట్టించుకోవడం లేదు. ఎలక్ట్రిక్ స్కూటర్లు మంచి రవాణా సదుపాయాలన్ని కలిగి ఉన్నాయి. కానీ వీటికి భద్రత కూడా చాలా ముఖ్యమైనదని కన్స్యూమర్ రిపోర్టుల సీనియర్ పాలసీ విశ్లేషకుడు విలియం వాలెస్ పేర్కొన్నారు.