బచ్చన్ ల కుటుంబానికి అదనపు పోలీసు భద్రత

బాలీవుడ్, డ్రగ్స్ అంశాలపై పార్లమెంటులో ఎంపీ జయాబచ్చన్ చేసిన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో ఆమెపై ట్రోలింగ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. బాలీవుడ్ కి డ్రగ్స్ తో అంతగా లింక్ లేదన్నట్టు ఆమె ఇఛ్చిన స్పీచ్ పట్ల పలువురు..

బచ్చన్ ల కుటుంబానికి అదనపు పోలీసు భద్రత
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 16, 2020 | 3:04 PM

బాలీవుడ్, డ్రగ్స్ అంశాలపై పార్లమెంటులో ఎంపీ జయాబచ్చన్ చేసిన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో ఆమెపై ట్రోలింగ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. బాలీవుడ్ కి డ్రగ్స్ తో అంతగా లింక్ లేదన్నట్టు ఆమె ఇఛ్చిన స్పీచ్ పట్ల పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆమెపై విరుచుకపడ్డారు. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఎందుకైనా మంచిదని బచ్చన్ ల కుటుంబానికి అదనపు భద్రతను కల్పించింది. అమితాబ్ నివాసం జల్సా వద్ద, జుహు లోని జయాబచ్ఛన్ ఇంటివద్ద పోలీసు బందోబస్తును పెంచారు. అలాగే జయపై సోషల్ మీడియాలో  వ్యంగ్యంగా వచ్ఛే విమర్శలు, కార్టూన్లు తదితరాలపై నిఘా పెట్టేందుకు, అందుకు కారకులైనవారరిని పట్టుకునేందుకు సైబర్ సెల్ విభాగం కూడా రంగంలోకి దిగింది.

జయబచ్చన్ కామెంట్లను  బీజేపీ నేతలు,  బాలీవుడ్ నటి కంగనా రనౌత్  తదితరులు దుయ్యబట్టిన సంగతి తెలిసిందే.