రజనీకి కరోనా అంటూ బాలీవుడ్ నటుడి ట్వీట్.. ఫ్యాన్స్ ఫైర్..!

ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు కరోనా విలయతాండవం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ వారికి ఏమీ అవ్వకూడదంటూ అందరూ వారి వారి దేవళ్లని ప్రార్థిస్తున్నారు. ఇదిలా ఉంటే సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు కరోనా వచ్చిందంటూ బాలీవుడ్ నటుడు రోహిత్ రాయ్ ట్వీట్ చేశారు. రజనీకాంత్‌కి కరోనా పాజిటివ్‌గా తేలింది. అయితే కరోనా క్వారంటైన్‌లో ఉంది అంటూ సరదాగా అతడు తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అంతేకాదు కరోనాను తరిమి కొట్టండి. జాగ్రత్తగా ఉండండి. మాస్క్‌ ధరించండి. తరచుగా శానిటైజ్ చేసుకోండి […]

రజనీకి కరోనా అంటూ బాలీవుడ్ నటుడి ట్వీట్.. ఫ్యాన్స్ ఫైర్..!
Follow us

| Edited By:

Updated on: Jun 06, 2020 | 8:01 PM

ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు కరోనా విలయతాండవం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ వారికి ఏమీ అవ్వకూడదంటూ అందరూ వారి వారి దేవళ్లని ప్రార్థిస్తున్నారు. ఇదిలా ఉంటే సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు కరోనా వచ్చిందంటూ బాలీవుడ్ నటుడు రోహిత్ రాయ్ ట్వీట్ చేశారు. రజనీకాంత్‌కి కరోనా పాజిటివ్‌గా తేలింది. అయితే కరోనా క్వారంటైన్‌లో ఉంది అంటూ సరదాగా అతడు తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అంతేకాదు కరోనాను తరిమి కొట్టండి. జాగ్రత్తగా ఉండండి. మాస్క్‌ ధరించండి. తరచుగా శానిటైజ్ చేసుకోండి అని కొన్ని సూచనలు కూడా చేశారు.

అయితే రోహిత్ రాయ్‌ పెట్టిన పోస్ట్‌పై రజనీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయనను విమర్శిస్తూ వారు కామెంట్లు చేశారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన ఆ నటుడు వివరణ ఇచ్చారు. సరదాగా తీసుకోండి. కోపాలు వద్దు. జోక్‌ని జోక్‌లా తీసుకోండి. ఇది రజనీ సర్‌పై వేసిన జోక్‌ అంతే. నా పోస్ట్ వెనుక ఉద్దేశం తెలిస్తే మీరు నవ్వుతారు. నన్ను తిట్టేముందు నా పోస్ట్‌ని చదవండి. మీకే నవ్వు వస్తుంది అని అన్నారు. అయినా కోపం చల్లారని రజనీ అభిమానులు., రోహిత్‌ని సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్నారు.

Read This Story Also: ఒకే సినిమాలో.. ఒకే పాత్రలో.. తండ్రీకొడుకులు..!

Latest Articles