కేంద్రం కోవిడ్ వ్యాక్సిన్ ఫ్రీగా ఇవ్వలేకపోతే మేమే ఆ పని చేస్తాం, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, 16 నుంచి వ్యాక్సినేషన్

కోవిడ్ వ్యాక్సిన్ ని కేంద్రం ఉచితంగా ఇవ్వలేకపోతే తామే ఆ పని చేస్తామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. దేశంలో ప్రజలందరికీ ఫ్రీగా టీకామందు ఇవ్వాలని తాము కోరుతున్నామని ఆయన చెప్పారు.

  • Umakanth Rao
  • Publish Date - 7:26 pm, Wed, 13 January 21

కోవిడ్ వ్యాక్సిన్ ని కేంద్రం ఉచితంగా ఇవ్వలేకపోతే తామే ఆ పని చేస్తామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. దేశంలో ప్రజలందరికీ ఫ్రీగా టీకామందు ఇవ్వాలని తాము కోరుతున్నామని ఆయన చెప్పారు. కేంద్రం, శాస్త్రవేత్తలు కూడా అన్ని ప్రొటొకాల్స్ ని పాటిస్తున్న విషయం తమకు తెలుసునని, వ్యాక్సినేషన్ కోసం ప్రజలు ముందుకు రావాలని ఆయన కోరారు. సంవత్సరం పైగా ఢిల్లీ వాసులు కరోనా వైరస్ తో సతమతమయ్యారని, ఇప్పటికైనా వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం హర్షణీయమని కేజ్రీవాల్ పేర్కొన్నారు.  ఈ వైరస్ కారణంగా మొత్తం దేశమే దాదాపు అల్లకల్లమయ్యే పరిస్థితి వంటిది ఏర్పడిందని ఆయన అభిప్రాయపడ్డారు. త్వరలో ఇతర టీకామందులు కూడా అందుబాటులోకి రాగలవన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.

కాగా-2.64 లక్షల డోసులతో కూడిన తొలి కోవిషీల్డ్ టీకామందు నిన్న ఈ నగరానికి చేరింది. శనివారం నుంచి ఈ సిటీలో 89 సెంటర్లలో వ్యాక్సినేషన్ డైవ్ ప్రారంభం కానుంది.