అక్రమంగా భారత్ లోకి ప్రవేశించిన మహిళ అరెస్ట్

ఎన్ని హెచ్చరికలు చేసినా పాక్ వక్రబుద్ధి మానడంలేదు. భారత్ పై కుట్రల్లో భాగంగా అక్రమార్కులు చొరబాటులను ప్రోత్సహిస్తూనే ఉంది. ఇదే క్రమంలో ఎటువంటి అనుమ‌తులు లేకుండా యూపీలోని నోయిడాలో తిరుగుతున్న పాకిస్తాన్ మహిళను నోయిడా పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు.

అక్రమంగా భారత్ లోకి ప్రవేశించిన మహిళ అరెస్ట్
Follow us

|

Updated on: Aug 30, 2020 | 9:48 AM

ఎన్ని హెచ్చరికలు చేసినా పాక్ వక్రబుద్ధి మానడంలేదు. భారత్ పై కుట్రల్లో భాగంగా అక్రమార్కులు చొరబాటులను ప్రోత్సహిస్తూనే ఉంది. ఇదే క్రమంలో ఎటువంటి అనుమ‌తులు లేకుండా యూపీలోని నోయిడాలో తిరుగుతున్న పాకిస్తాన్ మహిళను నోయిడా పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. నోయిడా సెక్టార్ 14 ఏ లోని ఫ్లైఓవర్ ద‌గ్గ‌ర‌ పోలీసుల తనిఖీ జరుగుతోంది. ఈ స‌మ‌యంలో ఒక బ‌స్సు ఢిల్లీ నుంచి నోయిడాకు వచ్చింది. పోలీసులు ఆ బ‌స్సును త‌నిఖీ చేసే స‌మ‌యంలో ఆ మహిళ సరియైన పత్రాలు లేకుండా నోయిడా సరిహద్దుల్లోకి ప్రవేశించిన‌ట్లు గుర్తించారు. ఈ మ‌హిళ చెల్లుబాటు అయ్యే అనుమతి లేకుండా నోయిడా సరిహద్దుల్లోకి ప్రవేశించినట్లు ఆరోపణలు ఉన్నాయి. మహిళను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ప్రత్యేకంగా విచారిస్తున్నారు. పాక్ నుంచి ఎప్పడు వచ్చింది. ఎయే ప్రాంతాల్లో పర్యటించిందని నిఘా వర్గాలు ఆరా తీస్తున్నారు.