రాజస్తాన్ సంక్షోభంలో మరో మలుపు.. ‘సుప్రీం’ లో కేసు ఉపసంహరించుకున్న స్పీకర్

రాజస్తాన్ సంక్షోభం కొత్త మలుపు తిరిగింది. సచిన్ పైలట్ ని, ఆయన వర్గాన్ని అనర్హులుగా ప్రకటిస్తూ తను జారీ చేసిన నోటీసును ఆయన సుప్రీంకోర్టులో సవాలు చేయడాన్ని, అలాగే రాజస్థాన్ హైకోర్టు..

రాజస్తాన్ సంక్షోభంలో మరో మలుపు.. 'సుప్రీం' లో కేసు ఉపసంహరించుకున్న స్పీకర్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 27, 2020 | 1:11 PM

రాజస్తాన్ సంక్షోభం కొత్త మలుపు తిరిగింది. సచిన్ పైలట్ ని, ఆయన వర్గాన్ని అనర్హులుగా ప్రకటిస్తూ తను జారీ చేసిన నోటీసును ఆయన సుప్రీంకోర్టులో సవాలు చేయడాన్ని, అలాగే రాజస్థాన్ హైకోర్టు రూలింగ్ పై అత్యున్నత న్యాయ స్థానం స్టే ఇచ్చేందుకు నిరాకరించడాన్ని ప్రశ్నిస్తూ తను వేసిన పిటిషన్ ని స్పీకర్ సీపీ జోషీ ఉపసంహరించుకున్నారు. మరో వైపు శాసన సభను ఈ నెల 31 నుంచి సమావేశపరచాలన్న సీఎం అశోక్ గెహ్లాట్ అభ్యర్థనను గవర్నర్ కల్ రాజ్ మిశ్రా తొసిపుచ్చారు. గెహ్లాట్ సమర్పించిన రెండో ప్రతిపాదనను ఆయనకే తిరిగి ఇచ్ఛేశారు. ఈ కరోనా వైరస్ పరిస్థితుల్లో ఎమ్మెల్యేలకు మూడు వారాల నోటీసు ఎలా ఇస్తామని, అసలు మీరు బల పరీక్షను కోరుతున్నారా. లేదా అని కూడా ఆయన ప్రశ్నించారు. మీరు సమర్పించిన రెండో ప్రతిపాదనలో ఫ్లోర్ టెస్టుకు సంబంధించిన అంశమే లేదన్నారు. ఇంత తక్కువ వ్యవధిలో సభను ఎలా సమావేశపరచాలని కూడా ప్రశ్నించారు.