బిహార్ ఎన్నికల్లో గెలుపు కోసం కమలదళం పక్కా వ్యూహాలు

కరోనా కాలంలో కూడా కమలదళం ఎన్నికల ప్రచారాలకు వ్యూహాలను పక్కా రచిస్తోంది. అది కూడా టెక్నాలజీని ఉపయోగిస్తూ.. రోడ్డెక్కకుండానే. సోషల్ మీడియాలో బీజేపీ శ్రేణులు ఎంత..

బిహార్ ఎన్నికల్లో గెలుపు కోసం కమలదళం పక్కా వ్యూహాలు
Follow us

| Edited By:

Updated on: Jul 02, 2020 | 8:27 PM

కరోనా కాలంలో కూడా కమలదళం ఎన్నికల ప్రచారాలకు వ్యూహాలను పక్కా రచిస్తోంది. అది కూడా టెక్నాలజీని ఉపయోగిస్తూ.. రోడ్డెక్కకుండానే. సోషల్ మీడియాలో బీజేపీ శ్రేణులు ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. ఇక ఎన్నికలు ఉన్నాయంటే.. వీరు అంతా ఇంతా బిజీ ఉండరు. ఏకంగా సోషల్ మీడియా మానిటరింగ్‌ చేసేందుకు ప్రత్యేక వింగ్‌ను కూడా ఏర్పాటు చేస్తారు. దీనికి పలువురు ఐటీ హెడ్స్‌ను కూడా ఏర్పాటు చేస్తారు. ముఖ్యంగా ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, వాట్సాప్‌ వంటి సోషల్ మీడియాలపై ఎక్కువ దృష్టిసారిస్తారు. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లలో ప్రత్యేకంగా గ్రూపులను క్రియేట్‌ చేసి.. బీజేపీ ఎన్నికల ప్రచారం చేపడుతుంటారు. అయితే ఇప్పుడు రాబోయే బిహార్‌ ఎన్నికల్లో గెలిచేందుకు కమల దళం దృష్టి సారించింది.

ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో.. సోషల్ మీడియాపైనే ఎక్కువ దృష్టి సారిస్తోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా కరోనా కాలంలో అరవై వర్చువల్‌ ర్యాలీలను నిర్వహించిన సంగతి తెలిసిందే. అదే జోష్‌ను ఇప్పుడు బిహార్‌ ఎన్నికల్లో కూడా ఉంచేందుకు అధిష్టానం కూడా ఉత్సాహంగా ఉంది. బిహార్‌ ఎన్నికల్లో కమల దళం వికసించేందుకు 9,500 మంది ఐటీ హెడ్స్‌ను నియమించింది. ప్రతి ఒక్క శక్తి కేంద్రానికి ఒక ఐటీ హెడ్‌ను ఉంచుతూ.. వారి ద్వారా బీజేపీకి సంబంధించిన ప్రచారాన్ని విస్తృతంగా చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. అంతేకాదు.. దాదాపు 72 వేల వాట్సాప్‌ గ్రూపులను కూడా క్రియేట్ చేసి.. ఈ గ్రూపుల ద్వారా.. గ్రామీణ ప్రాంతాల్లో కూడా బీజేపీ డిజిటల్ ప్రచారానికి తెరలేపుతోంది. అంతేకాదు.. వీటి ద్వారా.. ప్రతి శక్తి  కేంద్రంలో కూడా వర్చువల్ ర్యాలీలు నిర్వహించేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. ఈ వాట్సాప్‌ గ్రూపుల ద్వారానే.. బీజేపీ నేతల ప్రసంగాలను ప్రచారం చేయనున్నారు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు