శ్రీలంక భద్రతా దళాల ఉగ్రవేట.. 15 మంది హతం

ఈస్టర్ సండే రోజున ఉగ్రదాడుల తర్వాత ఉగ్రవాదుల కోసం శ్రీలంక భద్రతా దళాలు ఉగ్రవేట ప్రారంభించాయి. శ్రీలంక తూర్పు తీరంలో శుక్రవారం రాత్రంతా అనుమానిత ఇస్లామిక్ ఉగ్రవాదులతో జరిగిన భీకర్ ఎన్‌కౌంటర్‌లో 15 మంది మృతి చెందారు. అంపార ప్రాంతంలోని సెంథామారుతూ వద్ద ఉగ్రవాదులు ఓ ఇంట్లో దాక్కున్నారని శ్రీలంక భద్రతాబలగాలకు సమాచారం అందింది. దీంతో భద్రతాబలగాలు వారి కోసం గాలిస్తుండగా ఉగ్రవాదులు ఇంటి నుంచి కాల్పులు జరిపారు. మిలిటెంట్లు మూడు సార్లు పేలుడు పదార్థాలు సైతం […]

శ్రీలంక భద్రతా దళాల ఉగ్రవేట.. 15 మంది హతం
Follow us

| Edited By:

Updated on: Apr 27, 2019 | 10:56 AM

ఈస్టర్ సండే రోజున ఉగ్రదాడుల తర్వాత ఉగ్రవాదుల కోసం శ్రీలంక భద్రతా దళాలు ఉగ్రవేట ప్రారంభించాయి. శ్రీలంక తూర్పు తీరంలో శుక్రవారం రాత్రంతా అనుమానిత ఇస్లామిక్ ఉగ్రవాదులతో జరిగిన భీకర్ ఎన్‌కౌంటర్‌లో 15 మంది మృతి చెందారు. అంపార ప్రాంతంలోని సెంథామారుతూ వద్ద ఉగ్రవాదులు ఓ ఇంట్లో దాక్కున్నారని శ్రీలంక భద్రతాబలగాలకు సమాచారం అందింది. దీంతో భద్రతాబలగాలు వారి కోసం గాలిస్తుండగా ఉగ్రవాదులు ఇంటి నుంచి కాల్పులు జరిపారు. మిలిటెంట్లు మూడు సార్లు పేలుడు పదార్థాలు సైతం విసిరారు. ఈ ఘటనలో 15 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. మరో ముగ్గురు ఇతరులు కూడా గాయపడ్డారు.

ఉగ్రవాదుల రహస్య స్థావరంలో భద్రతా బలగాలకు మందుగుండు సామాగ్రి, డిటోనేటర్లు, సూసైడ్ కిట్స్, మిలటరీ యూనిఫాం, ఇస్లామిక్ స్టేట్ జెండాలు లభించాయని శ్రీలంక పోలీసులు చెప్పారు. శుక్రవారం రాత్రి శ్రీలంక తూర్పు తీరంలో మిలటరీ జరిపిన దాడుల్లో ఆరుగురు సూసైడ్ బాంబర్లు హతమయ్యారని శ్రీలంక మిలటరీ అధికార ప్రతినిధి వెల్లడించారు. చర్చ్, హోటళ్లలో పేలుళ్లు జరిపిన వారు అంపారలో దాక్కున్నారని అందిన సమాచారం మేర భద్రతా జవాన్లు దాడి చేసి వారిని హతమార్చారు. కాల్పుల్లో మరణించిన ఉగ్రవాదులు నేషనల్ తౌహీద్ జమాత్ కు చెందిన వారిగా అనుమానిస్తున్నామన్నారు.

కాగా, పేలుళ్ల ఘటనతో సంబంధం ఉన్న వారిగా అనుమానిస్తూ.. ఇప్పటి వరకు 76 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో సిరియా, ఈజిప్ట్ దేశాలకు చెందిన వారు కూడా ఉన్నారు.

తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!