సినిమాలకు నటి జైరా వాసిం గుడ్‌బై

శ్రీనగర్‌: బాలీవుడ్‌ నటి జైరా వాసిం బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడంపై జమ్ముకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా స్పందించారు. ముస్లింలకు వ్యతిరేకంగా బెదిరింపులకు పాల్పడుతున్నవారి కారణంగా చిత్రపరిశ్రమ నుంచి తప్పుకోవాలనుకుంటున్నట్లు జైరా సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించడం బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఒమర్ అబ్దుల్లా ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘జైరా వాసిం తీసుకున్న నిర్ణయాల పట్ల ప్రశ్నించడానికి మనమెవరు? ఇది ఆమె జీవితం. తనను సంతోషపరిచే అంశాలనే ఎంచుకుంటారు. ఆమెకు అంతా మంచి జరగాలని మాత్రమే […]

సినిమాలకు నటి  జైరా వాసిం గుడ్‌బై
Follow us

| Edited By: Srinu

Updated on: Jul 01, 2019 | 8:20 PM

శ్రీనగర్‌: బాలీవుడ్‌ నటి జైరా వాసిం బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడంపై జమ్ముకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా స్పందించారు. ముస్లింలకు వ్యతిరేకంగా బెదిరింపులకు పాల్పడుతున్నవారి కారణంగా చిత్రపరిశ్రమ నుంచి తప్పుకోవాలనుకుంటున్నట్లు జైరా సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించడం బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.

దీనిపై ఒమర్ అబ్దుల్లా ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘జైరా వాసిం తీసుకున్న నిర్ణయాల పట్ల ప్రశ్నించడానికి మనమెవరు? ఇది ఆమె జీవితం. తనను సంతోషపరిచే అంశాలనే ఎంచుకుంటారు. ఆమెకు అంతా మంచి జరగాలని మాత్రమే నేను కోరుకోగలను’ అని పేర్కొన్నారు.

కశ్మీరీ యువతైన జైరా.. ‘దంగల్‌’ చిత్రంతో బాలీవుడ్‌కు పరిచయమయ్యారు. తాను ముస్లిం కావడంతో చిత్ర పరిశ్రమలో అనూహ్య సంఘటనలు ఎదుర్కోవాల్సి వస్తోందని జైరా ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తన పట్ల ఏం జరిగిందో మాత్రం వెల్లడించలేదు.

View this post on Instagram

A post shared by Zaira Wasim (@zairawasim_) on

Latest Articles