క్రికెట్ బెట్టింగ్ ఆపై ఆన్‌లైన్ లోన్..మెడకు చుట్టుకున్న అప్పులు.. యువకుడు ఆత్మహత్య

ప్రజంట్ యూత్‌ను ఇప్పుడు రెండు సమస్యలు ప్రధానంగా వేధిస్తున్నాయి. ఒకటి క్రికెట్ బెట్టింగ్..రెండు ఆన్‌లైన్ రుణ సంస్థలు. అవును…

  • Ram Naramaneni
  • Publish Date - 7:16 am, Fri, 4 December 20

ప్రజంట్ యూత్‌ను ఇప్పుడు రెండు సమస్యలు ప్రధానంగా వేధిస్తున్నాయి. ఒకటి క్రికెట్ బెట్టింగ్..రెండు ఆన్‌లైన్ రుణ సంస్థలు. అవును…యూత్‌ ఈజీ మనీ కోసం పెడదారి పడుతోంది. క్రికెట్ బెట్టింగుల వైపు చూస్తోంది. ఆ బెట్టింగులలో నష్టపోతే ఏం చెయ్యాలో తెలియక ఆన్‌లైన్ రుణ సంస్థలను అప్రోచ్ అవుతున్నారు. సదరు సంస్థలు ఇచ్చినట్టే డబ్బులు ఇచ్చి…భారీ వడ్డీలు వేస్తూ..వాటిని కట్టకపోతే బెదిరింపులకు పాల్పడుతున్నాయి. తాజాగా ఈ ఒత్తిడిల వల్ల ఓ యువకుడు తనువు చాలించడు. ఈ ఘటన మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లో జరిగింది.

వివరాల్లోకి వెళ్తే.. ఎద్దు శ్రీరాములు, నాగమణి దంపతుల రెండో తనయుడు శ్రావణ్‌(24) డిగ్రీ కంప్లీట్ చేశాడు. ఇటీవల అతడు క్రికెట్‌ బెట్టింగ్‌కు బానిసయ్యాడు. ఈ క్రమంలో డబ్బుల్లేక ఆన్‌లైన్‌లో ఢిల్లీ చిరునామాగా ఉన్న ఓ సంస్థనుంచి రెణ్నెల్ల క్రితం రూ.16 వేల లోన్ తీసుకున్నాడు. ఆ డబ్బు బెట్టింగుల్లో పెట్టి నష్టపోవడంతో తిరిగి చెల్లించలేకపోయాడు. గడువు ముగియడంతో రుణసంస్థ యువకుడికి వాట్సాప్‌ ద్వారా లీగల్‌ నోటీసును పంపింది. దీంతో పరువు పోతుందని భయపడిన అతడు తిరిగి చెల్లించేందుకు ఒక్కరోజు ఆగమని సంస్థ ప్రతినిధితో రిక్వెస్ట్ చేశాడు. ఆయన నో చెప్పడంతో మానసికంగా కుంగిపోయిన శ్రావణ్‌.. బుధవారం రాత్రి ఇంటిపైన పెంట్‌హౌస్‌ రెయిలింగ్‌కు ఉరేసుకున్నాడు.