ఎస్ బ్యాంక్ సంక్షోభం సమాప్తం.. 18 నుంచి సర్వీసులు ప్రారంభం

సంక్షోభంలో కూరుకుపోయిన ఎస్ బ్యాంక్ తన పూర్తి స్థాయి బ్యాంకింగ్ సర్వీసులను ఈ నెల 18 (బుధవారం) సాయంత్రం 6 గంటల నుంచి పునరుధ్ధరించనుంది.

  • Umakanth Rao
  • Publish Date - 5:28 pm, Mon, 16 March 20

సంక్షోభంలో కూరుకుపోయిన ఎస్ బ్యాంక్ తన పూర్తి స్థాయి బ్యాంకింగ్ సర్వీసులను ఈ నెల 18 (బుధవారం) సాయంత్రం 6 గంటల నుంచి పునరుధ్ధరించనుంది. మార్చి 19 నుంచి మాకు చెందిన 1132 బ్రాంచీలలో వేటినైనా విజిట్ చేయండి.. మా సర్వీసులు అందుబాటులో ఉంటాయి అని ఈ బ్యాంకు ట్వీట్ చేసింది. మీరు మా డిజిటల్ సర్వీసులు, ఆయా ఇతర ప్లాట్ ఫామ్స్ కి కూడా యాక్సెస్ కావచ్ఛునని పేర్కొంది. ఈ బ్యాంకు పునరుధ్ధరణ పథకంలో భాగంగా రిజర్వ్ బ్యాంకు సూచనపై ఎస్ బీ ఐ ఇందులో 49 శాతం పెట్టుబడులు పెట్టబోతోంది. ఈ పథకానికి కేంద్ర కేబినెట్ ఇటీవల ఆమోద ముద్ర వేసింది. ఎస్ బ్యాంకు అధీకృత షేర్  కేపిటల్ మొత్తాన్ని రూ. 1100  కోట్ల నుంచి రూ. 6,200 కోట్లకు పెంచి సవరించనున్నారు. అటు- ఎస్ బీ ఐ తో బాటు ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్, హెచ్ డీ ఎఫ్ సీ వంటి ఇతర బ్యాంకులు కూడా ఇందులో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయి.