‘కెజిఎఫ్’ అధీరా ఎవరు.?

కన్నడ స్టార్ హీరో యష్ ప్రధాన పాత్రలో దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన చిత్రం ‘కెజిఎఫ్’. గత సంవత్సరం డిసెంబర్‌లో ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. ఎటువంటి అంచనాలు లేకుండా ఈ చిత్రం రిలీజై బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. దీనితో దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో యష్ ఇండియా ఫేమస్ అయ్యారు. ఇక ఈ మూవీకి కొనసాగింపుగా ‘కెజిఎఫ్’ పార్ట్ 2 […]

'కెజిఎఫ్' అధీరా ఎవరు.?
Follow us

|

Updated on: Jul 26, 2019 | 4:38 PM

కన్నడ స్టార్ హీరో యష్ ప్రధాన పాత్రలో దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన చిత్రం ‘కెజిఎఫ్’. గత సంవత్సరం డిసెంబర్‌లో ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. ఎటువంటి అంచనాలు లేకుండా ఈ చిత్రం రిలీజై బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. దీనితో దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో యష్ ఇండియా ఫేమస్ అయ్యారు.

ఇక ఈ మూవీకి కొనసాగింపుగా ‘కెజిఎఫ్’ పార్ట్ 2 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మొదటి భాగాన్ని నిర్మించిన హోమబుల్ ఫిలిమ్స్ ఈ భాగాన్ని కూడా నిర్మిస్తుంది. ఇందులో మెయిన్ విలన్ అయిన అధీరా లుక్‌ను ఈ నెల 29న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ కొద్దిసేపటి క్రితం ఓ పోస్టర్ ద్వారా ప్రకటించారు.

ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ నటిస్తుండగా.. అధీరా పాత్రను ఆయనే పోషిస్తున్నాడేమోనని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. మరి చూడాలి కోలార్ మాఫియా విలన్ ఎవరనేది.?