‘వాళ్ళ పైకి కుక్కల్ని, ఆయుధాలను ప్రయోగించి ‘గ్రీట్’ చేసేవాడ్ని.. ట్రంప్

తన అధ్యక్షభవనం వైట్ హౌస్ ముట్టడికి వఛ్చిన ఆందోళనకారులను చీల్చి చెండాడేందుకు కుక్కల్ని, ప్రమాదకరమైన ఆయుధాలను ప్రయోగించేవాడినని ..

'వాళ్ళ పైకి కుక్కల్ని, ఆయుధాలను ప్రయోగించి 'గ్రీట్' చేసేవాడ్ని.. ట్రంప్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 31, 2020 | 11:15 AM

తన అధ్యక్షభవనం వైట్ హౌస్ ముట్టడికి వఛ్చిన ఆందోళనకారులను చీల్చి చెండాడేందుకు కుక్కల్ని, ప్రమాదకరమైన ఆయుధాలను ప్రయోగించేవాడినని  అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. వారు వైట్ హౌస్ ఫెన్సింగ్ దాటి వస్తే ఇదే పని చేసి ఉండేవాడిని అన్నారు. నల్లజాతీయుడైన జార్జ్ ఫ్లాడ్ అనే వ్యక్తిని మినియాపొలిస్ లో ఓ పోలీసు దారుణంగా హతమార్చడంతో అమెరికా అంతటా నిరసన జ్వాలలు రేగాయి. డెట్రాయిట్ లో ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఓ యువకుడు మరణించాడు, వాషింగ్టన్ లో కూడా ఆందోళనకారులు పెద్దఎత్తున నిరసనలకు దిగారు. తాను భవనం లోపల కూర్చుని  ప్రతి ఘటనను చూశానని, ఒక దశలో తనకు భద్రత తగ్గిందేమోనని భావించానని ట్రంప్ అన్నారు. వైట్ హౌస్ రక్షణగా ఉన్న సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లను ఆయన ప్రశంసించారు. నేను చాలా కూల్ గా ఉన్నాను అంటూనే.. అవసరమైతే సీక్రెట్ ఏజంట్లు నిరసనకారులపైకి దూసుకువెళ్ళేవారని ఆయన చెప్పారు. ఆందోళనకారులు లూటీలకు దిగితే షూట్ చేస్తామని ఆయన హెచ్చరించారు.