ప్రపంచ వ్యాప్తంగా టెర్రర్ సృష్టిస్తోన్న కరోనా.. ఈ రోజు ఎన్ని కేసులంటే?

ప్ర‌పంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. రోజురోజుకీ కరోనా వైరస్ మహమ్మారి వికృత రూపం దాల్చుతోంది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమయ్యాయి. రోజురోజుకీ కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య‌, మరణాల సంఖ్య‌ పెరుగుతూనే ఉన్నాయి. ఇక ఇప్ప‌టికే ఈ వైర‌స్ బారిన ప‌డి ప‌లువురు ప్ర‌ముఖులు..

ప్రపంచ వ్యాప్తంగా టెర్రర్ సృష్టిస్తోన్న కరోనా.. ఈ రోజు ఎన్ని కేసులంటే?
Follow us

| Edited By:

Updated on: Jul 16, 2020 | 10:59 AM

ప్ర‌పంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. రోజురోజుకీ కరోనా వైరస్ మహమ్మారి వికృత రూపం దాల్చుతోంది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమయ్యాయి. రోజురోజుకీ కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య‌, మరణాల సంఖ్య‌ పెరుగుతూనే ఉన్నాయి. ఇక ఇప్ప‌టికే ఈ వైర‌స్ బారిన ప‌డి ప‌లువురు ప్ర‌ముఖులు కన్నుమూసిన విష‌యం తెలిసిందే. తాజాగా ప్రపంచవ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,36,91,570 నమోదు కాగా కరోనాతో మొత్తం ఇప్పటివరకూ 5,86,820 మంది మరణించారు. ఇక ప్రస్తుతం 50,67,610 యాక్టీవ్ కేసులు ఉండగా, 80,37,140 మంది కోవిడ్ నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

ఇక అమెరికాలో క‌రోనా వైర‌స్ ఉగ్ర‌రూపం దాల్చుతోంది. రోజురోజుకీ కొత్తగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. నిన్న తాజాగా 67,632 కరోనా కసులు నమోదయ్యాయి. దీంతో ఇప్ప‌టివ‌ర‌కూ దేశ వ్యాప్తంగా మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 36,16,747కు చేరింది. అలాగే ఈ వైరస్ వల్ల ఇప్పటివరకూ 1,40,140 మంది మృతి చెందారు. కాగా అమెరికాలో ఇంత భారీ స్థాయిలో కేసులు న‌మోదు కావ‌డం ఇదే మొద‌టి సారి.

ఇక బ్రెజిల్‌లో 19,70,909 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవ్వగా 75,523 మంది మృతి చెందారు. అలాగే రష్యాలో 7,46,369 కరోనా కేసులు రిజిస్టర్ కాగా, 11,770 మంది మరణించారు. స్పెయిన్‌లో 3,04,574 కరోనా పాజిటివ్‌ కేసులు, 28,413 మంది మృతి, ఇంగ్లాండ్‌లో 2,91,911 కేసులు నమోదు, 45,053 మంది మృతి, ఇరాన్‌లో 2,64,561 కరోనా పాజిటివ్‌ కేసులు, 13,410 మంది మృతి, పాకిస్తాన్‌లో 2,55,769 కరోనా కేసులు, 5,386 మంది మృతి, ఇటలీలో 2,43,506 కరోనా పాజిటివ్‌ కేసులు, 34,997 మంది మృతి, సౌదీ అరేబియా 2,40,474 కరోనా కేసులు, 2,325 మంది మృతి చెందారు.

అలాగే భారత్​లో కరోనా వ్యాప్తి తీవ్ర‌త‌రం అవుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్తగా 32,695 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే నిన్న 606 మంది కోవిడ్-19 కార‌ణంగా ప్రాణాలు విడిచారు. ప్ర‌స్తుతం దేశంలో మొత్తం కేసుల సంఖ్య‌ 9,68,876కి చేరుకుంది. ప్రస్తుతం 3,31,146 యాక్టివ్ కేసులున్నాయి. అలాగే 6,12,815 మంది వ్యాధి బారి నుంచి కోలుకున్నారు. క‌రోనాతో మొత్తం మ‌ర‌ణించిన వారి సంఖ్య‌ 24,915.

Latest Articles
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..