ప్రపంచం మునుపెన్నడూ చూడని ఇంధన సంక్షోభం.. అంతర్జాతీయ ఇంధన సంస్థ హెచ్చరిక!

ఇరాన్ మరియు అమెరికా-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం దాదాపు మూడు వారాలుగా కొనసాగుతోంది, దీనికి ముగింపు కనిపించడం లేదు. ఈలోగా, ప్రపంచంలోనే అత్యంత కీలకమైన జలమార్గమైన హోర్ముజ్ జలసంధి మూసుకుపోతోంది. దీంతో భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాలపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ ఇంధన సంస్థ (IEA) ఇంధన సంక్షోభంపై హెచ్చరించింది.

ప్రపంచం మునుపెన్నడూ చూడని ఇంధన సంక్షోభం.. అంతర్జాతీయ ఇంధన సంస్థ  హెచ్చరిక!
Iea Executive Director Fatih Birol

Updated on: Mar 23, 2026 | 12:35 PM

ఇరాన్ మరియు అమెరికా-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం దాదాపు మూడు వారాలుగా కొనసాగుతోంది, దీనికి ముగింపు కనిపించడం లేదు. ఈలోగా, ప్రపంచంలోనే అత్యంత కీలకమైన జలమార్గమైన హోర్ముజ్ జలసంధి మూసుకుపోతోంది. దీంతో భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాలపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ ఇంధన సంస్థ (IEA) ఇంధన సంక్షోభంపై హెచ్చరించింది.

అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా హార్ముజ్ జలసంధి గుండా వెళ్లే నౌకలపై దాడి చేస్తామని ఇరాన్ బెదిరించడంతో, మధ్యప్రాచ్యం నుంచి వచ్చే ఇంధన సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ యుద్ధం వల్ల తలెత్తిన ఇంధన సంక్షోభం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు తీవ్రమైన ముప్పును కలిగిస్తోందని, దీని ప్రభావం నుంచి ఏ దేశమూ తప్పించుకోలేదని ఐఈఏ అధిపతి ఫాతిహ్ బిరోల్ అన్నారు. సోమవారం (మార్చి23) ఆస్ట్రేలియా రాజధానిలోని నేషనల్ ప్రెస్ క్లబ్‌లో మాట్లాడుతూ, “ప్రస్తుత పరిస్థితి గతంలో వచ్చిన రెండు చమురు సంక్షోభాల కలయికలా ఉంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన ముప్పును ఎదుర్కొంటోంది. ఈ సమస్య త్వరలో పరిష్కారమవుతుందని ఆశిస్తున్నాను. ఈ సంక్షోభం ఇదే దిశలో కొనసాగితే, ఏ దేశమూ దాని ప్రభావం నుంచి తప్పించుకోలేదు. తక్షణమే ప్రపంచవ్యాప్తంగా ఇందన పొదుపు చర్యలు అవసరం” అని ఆయన అన్నారు.

రాబోయే చమురు సంక్షోభం గురించి ఐఈఏ గతంలోనే హెచ్చరించింది. గత శుక్రవారం, ఈ సంక్షోభ ప్రభావాన్ని తగ్గించడానికి ప్రభుత్వాలు, అయిల్ కంపెనీలు తీసుకోగల సూచనలను ఈ సంస్థ అందించింది. మార్చి 11న, ఐఈఏ సభ్య దేశాలు అత్యవసర నిల్వల నుండి 400 మిలియన్ బ్యారెళ్ల చమురును విడుదల చేయడానికి అంగీకరించాయి. ఇది ఈ సంస్థ చరిత్రలో నిల్వల నుండి చేసిన అతిపెద్ద ఉపసంహరణ.

ఈ యుద్ధం ప్రపంచ చమురు మార్కెట్‌లో అతిపెద్ద సరఫరా అంతరాయాన్ని సృష్టించింది. హోర్ముజ్ జలసంధి గుండా రవాణా నిలిచిపోవడంతో, రోజుకు సుమారు 20 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు, ఇందన ఉత్పత్తులపై ప్రభావం పడింది. ఈ అంతరాయం పెట్రోలియం మార్కెట్‌పై ఒత్తిడిని పెంచింది. ముడి చమురు ధరలను బ్యారెల్‌కు $100 పైకి నెట్టింది. అంతేకాకుండా, డీజిల్, జెట్ ఫ్యూయల్, ఎల్‌పిజి వంటి శుద్ధి చేసిన ఉత్పత్తుల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి.

ఇదిలావుంటే, రాబోయే 48 గంటల్లోగా హోర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరవకపోతే, ఇరాన్ విద్యుత్ ప్లాంట్లను అమెరికా పూర్తిగా ధ్వంసం చేస్తుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌ను హెచ్చరించారు. ఇరాన్‌లోని అతిపెద్ద విద్యుత్ ప్లాంట్ వద్ద ఈ దాడి ప్రారంభమవుతుందని ఆయన అన్నారు. ట్రంప్ వార్నింగ్‌పై ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ వెంటనే ప్రతిస్పందించారు. తమ ఇంధన కేంద్రాలపై అమెరికా దాడి చేస్తే, హోర్ముజ్ జలసంధిని శాశ్వతంగా మూసివేయడమే కాకుండా, అమెరికా సైనిక స్థావరాలు ఉన్న అన్ని దేశాల ఇంధన కేంద్రాలను నాశనం చేస్తామని ఇరాన్ బదులిచ్చింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us