Kamala Harris: వైట్‌ హౌజ్‌ పక్కనే ఉన్నా.. కూతురుకు దూరంగా డొనాల్డ్‌ హారిస్‌

అమెరికా ఎన్నికలకు సమయం దగ్గరపడుతోన్న నేపథ్యంలో ప్రచార హోరు పెరుగుతోంది. అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న కమలాహారిస్‌ ప్రచారంలో దూసుకుపోతున్నారు. డొనాల్డ్‌ ట్రంప్‌కు పోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కమలా హారిస్‌ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలు ప్రస్తుతం చర్యనీయాంశంగా మారాయి...

Kamala Harris: వైట్‌ హౌజ్‌ పక్కనే ఉన్నా.. కూతురుకు దూరంగా డొనాల్డ్‌ హారిస్‌
Kamala Harris
Follow us

|

Updated on: Aug 31, 2024 | 1:22 PM

అమెరికా ఎన్నికలకు సమయం దగ్గరపడుతోన్న నేపథ్యంలో ప్రచార హోరు పెరుగుతోంది. అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న కమలాహారిస్‌ ప్రచారంలో దూసుకుపోతున్నారు. డొనాల్డ్‌ ట్రంప్‌కు పోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కమలా హారిస్‌ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలు ప్రస్తుతం చర్యనీయాంశంగా మారాయి. కమలా హారిస్‌ తండ్రి డోనాల్డ్‌ హారిస్‌ వైట్‌ హౌజ్‌కు కేవలం కూతవేటు దూరంలో ఉన్నా కమలా హారిస్‌ను ఒక్కసారి కూడా చూడడానికి రాలేదు. దీంతో తండ్రీకుమార్తెల మధ్య దూరం పెరిగిపోయినట్లు స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో అసలు కమలా హారిస్‌ కుటుంబ నేపథ్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

కమలా హారిస్‌ తండ్రి డొనాల్డ్‌ హారిస్‌.. 1938లో జమైకాలోని బ్రౌన్స్‌ పట్టణంలో జన్మించారు. ఆ తర్వాత విద్యాభ్యాసం కోసం డొనాల్డ్ హారిస్‌ లండన్‌కు వెళ్లారు. తిరిగి కాలిఫోర్నియాకు చేరుకొని అక్కడ పీహెచ్‌డీ పూర్తి చేశారు. ఇక కమలా హారిస్ తల్లి శామలాగోపాలన్‌ భారత్‌ నుంచి కాలిఫోర్నియాకు వచ్చారు. బెర్క్‌లీలో క్యాన్సర్‌పై పరిశోధనలు చేశారు. 1962లో బెర్క్‌లీలో తొలిసారి డొనాల్డ్ హారిస్‌, శామలాగోపాలన్‌ను కలిశారు. వీరి మధ్య ప్రేమ చిగురించింది. అనంతరం వివాహం చేసుకున్నారు. ఈ జంటకు కమలా, మాయా ఇద్దరు కుమార్తెలు జన్మించారు.

కమలా హారిస్‌కు ఏడేళ్ల వయసున్న సమయంలో శ్యామల, తండ్రి హారిస్‌ల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. దీంతో ఇద్దరు విడిపోయారు. కమలా తల్లి వద్దే కెనడా, ఇల్లినాయిస్‌లో పెరిగారు. ఆ తర్వాత కాలిఫోర్నియాకు వలస వెళ్లారు. ఆ తర్వాత నుంచి ఇరువురి మధ్య పెద్దగా సంబంధాలు లేకుండాపోయాయి. అప్పటి నుంచి తండ్రి, కూతుళ్ల మధ్య బంధం దూరమవుతూ వచ్చింది. అమెరికా ఉపాధ్యక్షురాలిగా గెలిచిన తొలి మహిళగా రికార్డు సృష్టించినా తండ్రి ఒక్కసారి స్పందించలేదు. కమలా హారిస్‌ ఉపాధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారానికి కూడా డొనాల్డ్‌ హాజరు కాకపోవడం గమనార్హం.

అయితే ప్రత్యర్థులు మాత్రం కమలా తండ్రిలోని కమ్యూనిస్ట్‌ భావాలను పుణికిపుచ్చుకుందని పలుసార్లు రాజకీయ ప్రత్యర్థులు సైతం పలు సార్లు ఆరోపించారు. ట్రంప్‌ సైతం ఇదే ఆరోపణను చేస్తూ వచ్చారు. అయితే ఒక్కసారి కూడా డొనాల్డ్‌ హారిస్‌ ఈ వార్తలపై స్పందించలేదు.దీంతో ఇప్పుడీ అంశం పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. మరి కమలా హారిస్‌ అమెరికా అధ్యక్షురాలిగా ఎన్నికైనా తర్వాత అయినా డొనాల్డ్ తన కూతురు గురించి మాట్లాడుతారో లేదో చూడాలి. ఇదిలా ఉంటే.. కమలా హారిస్‌ తల్లి శ్యామలా 2009లో పెద్దపేగు క్యాన్సర్‌తో మరణించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

హైడ్రా అంటె భయమా.. మీ ఇంటిని ఎక్కడికైనా తరలించండి| భూలోకంలో యముడు
హైడ్రా అంటె భయమా.. మీ ఇంటిని ఎక్కడికైనా తరలించండి| భూలోకంలో యముడు
చిన్న వయసులోనే చర్మం ముడతలు పడుతోందా.? అయితే ఇలా చెయ్యండి..
చిన్న వయసులోనే చర్మం ముడతలు పడుతోందా.? అయితే ఇలా చెయ్యండి..
పక్కపక్కనే భారత్‌, చైనా యుద్ధ నౌకలు.! శ్రీలంక తీరంలో పరిణామం.
పక్కపక్కనే భారత్‌, చైనా యుద్ధ నౌకలు.! శ్రీలంక తీరంలో పరిణామం.
రుణమాఫీ కాని రైతుల కోసం ప్రత్యేక యాప్.. ఎలా అప్లై చేయాలంటే.!
రుణమాఫీ కాని రైతుల కోసం ప్రత్యేక యాప్.. ఎలా అప్లై చేయాలంటే.!
గృహజ్యోతి లబ్దిదారులకు షాకింగ్‌ న్యూస్‌.! పెండింగ్‌ బిల్స్..
గృహజ్యోతి లబ్దిదారులకు షాకింగ్‌ న్యూస్‌.! పెండింగ్‌ బిల్స్..
విజయవాడ చరిత్రలోనే భయానకమైన వర్షం.! చూస్తే బెదిరేలా దృశ్యాలు..
విజయవాడ చరిత్రలోనే భయానకమైన వర్షం.! చూస్తే బెదిరేలా దృశ్యాలు..
కన్నతల్లిని భారంగా భావించిన కొడుకులు.. ఆ తల్లి ఏం చేసిందో తెలుసా?
కన్నతల్లిని భారంగా భావించిన కొడుకులు.. ఆ తల్లి ఏం చేసిందో తెలుసా?
మరో దారుణం.. నర్సింగ్‌ విద్యార్థినిపై ఆటో డ్రైవర్‌ అఘాయిత్యం.!
మరో దారుణం.. నర్సింగ్‌ విద్యార్థినిపై ఆటో డ్రైవర్‌ అఘాయిత్యం.!
కూరగాయలు ఫ్రీ.. ఎక్కడంటే.! ఒక్కసారిగా ఎగబడ్డ జనం.
కూరగాయలు ఫ్రీ.. ఎక్కడంటే.! ఒక్కసారిగా ఎగబడ్డ జనం.
రైలు పట్టాలపై గొడుగు వేసుకొని మరీ నిద్రపోయిన వ్యక్తి. చూస్తే షాక్
రైలు పట్టాలపై గొడుగు వేసుకొని మరీ నిద్రపోయిన వ్యక్తి. చూస్తే షాక్