Viral: అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి.. CT స్కాన్ చూసి బిత్తరపోయిన డాక్టర్

కొందరు ఫుడ్ పూర్తిగా ఉడక్కుండానే.. తింటూ ఉంటారు. ముఖ్యంగా మాంసం ఉడుకుతుండానే నోట్లో వేసుకుంటూ ఉంటారు. అలాంటివారికే ఈ అలెర్ట్. ఆ అలవాటు మార్చుకోకపోతే మీరు పెను ప్రమాదంలో పడే అవకాశం ఉంది.

Viral: అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి.. CT స్కాన్ చూసి బిత్తరపోయిన డాక్టర్
Patient With Cysticercosis
Follow us

|

Updated on: Aug 31, 2024 | 1:48 PM

సరిగ్గా ఉడకని ఆహారం తింటే రోగాల బారినపడతారని డాక్టర్లు పదే, పదే హెచ్చరిస్తూ ఉంటారు. అది కూడా మాసం సరిగ్గా ఉడికించకుండా తింటే.. జబ్బులు గ్యారంటీ. ఈ విషయం ఎన్నిసార్లు చెప్పినా కొందరు పెడచెవిన పెడుతూనే ఉంటారు. తాజాగా ఓ వ్యక్తి సరగ్గా ఉడికించకుండా పంది మాంసం తినడంతో.. అతని శరీరంలో పురుగులు(పరాన్న జీవులు) ఫామ్ అయ్యాయి. యుఎస్‌కు చెందిన డాక్టర్ ఇటీవల పంది మాంసం తినడం వల్ల పరాన్నజీవి ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న వ్యక్తి  CT స్కాన్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. సోషల్ మీడియాలో మెడికల్ కేస్ స్టడీస్‌ని క్రమం తప్పకుండా పంచుకునే ఎమర్జెన్సీ మెడిసిన్ ఫిజిషియన్ డాక్టర్ సామ్ ఘాలి సోమవారం నాడు, ‘ సిస్టిసెర్కోసిస్ ఇన్ఫెక్షన్’‌తో బాధపడుతున్న వ్యక్తి కేసు తాలూకా వివరాలను వెల్లడించారు.

అతను ఉడికి ఉడకని పంది మాసం తినడం వల్ల.. అది  జీర్ణశయాంతర ప్రేగులలో పరన్నా జీవులగా అభివృద్ధి చెందింది.  తీవ్రమైన సందర్భాల్లో, ఈ పురుగుల లార్వా మెదడుకు ప్రయాణించే చాన్స్ ఉంది. అదే జరిగితే తలనొప్పి, గందరగోళం, మూర్ఛలు వంటి తీవ్రమైన నాడీ సంబంధిత సమస్యలకు దారితీయవచ్చు. CT స్కాన్ చిత్రంలో రోగి దిగువ శరీరంలోని ఎముకల చుట్టూ చెల్లాచెదురుగా ఉన్న బియ్యం గింజల మాదిరిగా ఉన్న పురుగుల లార్వాను మీరు చూడవచ్చు. ఉడకని ఆహారం తిన్న ఐదు నుండి 12 వారాల తర్వాత, ఈ లార్వా జీర్ణశయాంతర ప్రేగులలో పరిపక్వ టేప్‌వార్మ్‌లుగా పరిణామం చెందుతాయి. ఈ పరిస్థితిని ఇంటెస్టినల్ టైనియాసిస్ అని పిలుస్తారని డాక్టర్ చెప్పారు.స

ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు  ప్రజలు ఎల్లప్పుడూ చేతులు కడుక్కోవాలని.. పచ్చి లేదా ఉడికించని మాంసం తినకుండా ఉండాలని డాక్టర్ ఘాలి ప్రజలను కోరారు. ఇలాంటి వ్యాధులకు యాంటీ-పారాసిటిక్ థెరపీ, స్టెరాయిడ్స్,  యాంటీ-ఎపిలెప్టిక్స్ వంటి చికిత్సలు అవలభిస్తారని వెల్లడించారు. కొన్నిసార్లు సర్జరీ ద్వారా టేప్‌వార్మ్‌లు రిమూవ్ చేయాల్సి ఉంటుందని తెలిపారు.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  

హైడ్రా అంటె భయమా.. మీ ఇంటిని ఎక్కడికైనా తరలించండి| భూలోకంలో యముడు
హైడ్రా అంటె భయమా.. మీ ఇంటిని ఎక్కడికైనా తరలించండి| భూలోకంలో యముడు
చిన్న వయసులోనే చర్మం ముడతలు పడుతోందా.? అయితే ఇలా చెయ్యండి..
చిన్న వయసులోనే చర్మం ముడతలు పడుతోందా.? అయితే ఇలా చెయ్యండి..
పక్కపక్కనే భారత్‌, చైనా యుద్ధ నౌకలు.! శ్రీలంక తీరంలో పరిణామం.
పక్కపక్కనే భారత్‌, చైనా యుద్ధ నౌకలు.! శ్రీలంక తీరంలో పరిణామం.
రుణమాఫీ కాని రైతుల కోసం ప్రత్యేక యాప్.. ఎలా అప్లై చేయాలంటే.!
రుణమాఫీ కాని రైతుల కోసం ప్రత్యేక యాప్.. ఎలా అప్లై చేయాలంటే.!
గృహజ్యోతి లబ్దిదారులకు షాకింగ్‌ న్యూస్‌.! పెండింగ్‌ బిల్స్..
గృహజ్యోతి లబ్దిదారులకు షాకింగ్‌ న్యూస్‌.! పెండింగ్‌ బిల్స్..
విజయవాడ చరిత్రలోనే భయానకమైన వర్షం.! చూస్తే బెదిరేలా దృశ్యాలు..
విజయవాడ చరిత్రలోనే భయానకమైన వర్షం.! చూస్తే బెదిరేలా దృశ్యాలు..
కన్నతల్లిని భారంగా భావించిన కొడుకులు.. ఆ తల్లి ఏం చేసిందో తెలుసా?
కన్నతల్లిని భారంగా భావించిన కొడుకులు.. ఆ తల్లి ఏం చేసిందో తెలుసా?
మరో దారుణం.. నర్సింగ్‌ విద్యార్థినిపై ఆటో డ్రైవర్‌ అఘాయిత్యం.!
మరో దారుణం.. నర్సింగ్‌ విద్యార్థినిపై ఆటో డ్రైవర్‌ అఘాయిత్యం.!
కూరగాయలు ఫ్రీ.. ఎక్కడంటే.! ఒక్కసారిగా ఎగబడ్డ జనం.
కూరగాయలు ఫ్రీ.. ఎక్కడంటే.! ఒక్కసారిగా ఎగబడ్డ జనం.
రైలు పట్టాలపై గొడుగు వేసుకొని మరీ నిద్రపోయిన వ్యక్తి. చూస్తే షాక్
రైలు పట్టాలపై గొడుగు వేసుకొని మరీ నిద్రపోయిన వ్యక్తి. చూస్తే షాక్