Restaurant Style Veg Kurma: రెస్టారెంట్ స్టైల్ వెజ్ కూర్మ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..

చాలా మంది అప్పుడప్పుడు అలా సరదాగా బయటకు వెళ్లి రెస్టారెంట్స్‌, హోటల్స్‌లో ఫుడ్ తింటూ ఉంటారు. అక్కడ ఉన్న వెరైటీ ఫుడ్స్ తయారు చేస్తూ ఉంటారు. అయితే మరీ ఎక్కువ సార్లు బయట ఫుడ్ తింటే ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. జస్ట్ కొన్ని చిట్కాలు పాటించి ఇంట్లోనే శుభ్రంగా తయారు చేసుకోవచ్చు. రెస్టారెంట్‌లో వెజ్ తినే వాళ్లు ఎక్కువగా ఆర్డర్ ఇచ్చే ఐటెమ్స్‌లో వెజ్ కూర్మ కర్రీ కూడా ఒకటి. మరి ఈ రెసిపీని ఇంట్లోనే మనం..

Restaurant Style Veg Kurma: రెస్టారెంట్ స్టైల్ వెజ్ కూర్మ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
Restaurant Style Veg Kurma
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Aug 31, 2024 | 9:26 PM

చాలా మంది అప్పుడప్పుడు అలా సరదాగా బయటకు వెళ్లి రెస్టారెంట్స్‌, హోటల్స్‌లో ఫుడ్ తింటూ ఉంటారు. అక్కడ ఉన్న వెరైటీ ఫుడ్స్ తయారు చేస్తూ ఉంటారు. అయితే మరీ ఎక్కువ సార్లు బయట ఫుడ్ తింటే ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. జస్ట్ కొన్ని చిట్కాలు పాటించి ఇంట్లోనే శుభ్రంగా తయారు చేసుకోవచ్చు. రెస్టారెంట్‌లో వెజ్ తినే వాళ్లు ఎక్కువగా ఆర్డర్ ఇచ్చే ఐటెమ్స్‌లో వెజ్ కూర్మ కర్రీ కూడా ఒకటి. మరి ఈ రెసిపీని ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీ చేయడానికి కాస్త సమయం పట్టినా.. ఎంతో రుచిగా ఉంటుంది. పిల్లలు, పెద్దలు ఇష్ట పడి మరీ తింటారు. మరి ఈ వెజ్ కూర్మ కర్రీ ఎలా తయారు చేస్తారు? కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వెజ్ కూర్మ కర్రీకి కావాల్సిన పదార్థాలు:

ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, వెజిటేబుల్స్ (మీకు నచ్చినవి), అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, ఆవాలు, పసుపు, కారం, ఉప్పు, గరం మాసాలా, ఉప్పు, కొత్తిమీర, కొబ్బరి పాలు లేదా పెరుగు, సోంపు గింజలు, నెయ్యి, నూనె.

వెజ్ కూర్మ కర్రీ తయారీ విధానం:

ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులో పచ్చి కొబ్బరి ముక్కలు, ఉల్లిపాయ, వెల్లుల్లి, అల్లం, పచ్చి మిర్చి, జీలకర్ర, ధనియాలు, సోంపు గిజంలు, పసుపు, గరం మాసలా పొడి వేసి మెత్తని పేస్టులా చేసుకోవాలి. ఈ పేస్టును పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత కూరగాయలను కూడా ఓ పది నిమిషాలు ఉడికించి పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టవ్ మీద కర్రీ పాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్, కొద్దిగా నెయ్యి వేసి వేడి చేయాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి ముక్కలు వేసి కలర్ మారేంత వరకు వేయించాలి. నెక్ట్స్ జీలకర్ర, ఆవాలు వేయాలి. ఇవి కాస్త వేగాక మాటా ముక్కలు వేసి మెత్తగా ఉడికించుకోవాలి.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు ముందుగా చేసుకున్న పేస్టు వేసి బాగా కలిపి ఆయిల్ పైకి తేలేంత వరకు మీడియం మంటపై ఉడికించాలి. ఇప్పుడు పక్కన పెట్టిన వెజిటేబుల్స్ కూడా వేసి ఓ పది నిమిషాలు ఉడికించుకున్నా.. కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా వేసి కలపాలి. ఇప్పుడు పెరుగు లేదా కొబ్బరి పాలను వేసి కలపాలి. ఇక చిన్న మంట పెట్టి ఓ పావు గంట సేపు కర్రీ ఉడికించుకోవాలి. చివరగా కొత్తిమీర వేసి కలుపుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే వెజ్ కూర్మ కర్రీ సిద్ధం.

హైడ్రా అంటె భయమా.. మీ ఇంటిని ఎక్కడికైనా తరలించండి| భూలోకంలో యముడు
హైడ్రా అంటె భయమా.. మీ ఇంటిని ఎక్కడికైనా తరలించండి| భూలోకంలో యముడు
చిన్న వయసులోనే చర్మం ముడతలు పడుతోందా.? అయితే ఇలా చెయ్యండి..
చిన్న వయసులోనే చర్మం ముడతలు పడుతోందా.? అయితే ఇలా చెయ్యండి..
పక్కపక్కనే భారత్‌, చైనా యుద్ధ నౌకలు.! శ్రీలంక తీరంలో పరిణామం.
పక్కపక్కనే భారత్‌, చైనా యుద్ధ నౌకలు.! శ్రీలంక తీరంలో పరిణామం.
రుణమాఫీ కాని రైతుల కోసం ప్రత్యేక యాప్.. ఎలా అప్లై చేయాలంటే.!
రుణమాఫీ కాని రైతుల కోసం ప్రత్యేక యాప్.. ఎలా అప్లై చేయాలంటే.!
గృహజ్యోతి లబ్దిదారులకు షాకింగ్‌ న్యూస్‌.! పెండింగ్‌ బిల్స్..
గృహజ్యోతి లబ్దిదారులకు షాకింగ్‌ న్యూస్‌.! పెండింగ్‌ బిల్స్..
విజయవాడ చరిత్రలోనే భయానకమైన వర్షం.! చూస్తే బెదిరేలా దృశ్యాలు..
విజయవాడ చరిత్రలోనే భయానకమైన వర్షం.! చూస్తే బెదిరేలా దృశ్యాలు..
కన్నతల్లిని భారంగా భావించిన కొడుకులు.. ఆ తల్లి ఏం చేసిందో తెలుసా?
కన్నతల్లిని భారంగా భావించిన కొడుకులు.. ఆ తల్లి ఏం చేసిందో తెలుసా?
మరో దారుణం.. నర్సింగ్‌ విద్యార్థినిపై ఆటో డ్రైవర్‌ అఘాయిత్యం.!
మరో దారుణం.. నర్సింగ్‌ విద్యార్థినిపై ఆటో డ్రైవర్‌ అఘాయిత్యం.!
కూరగాయలు ఫ్రీ.. ఎక్కడంటే.! ఒక్కసారిగా ఎగబడ్డ జనం.
కూరగాయలు ఫ్రీ.. ఎక్కడంటే.! ఒక్కసారిగా ఎగబడ్డ జనం.
రైలు పట్టాలపై గొడుగు వేసుకొని మరీ నిద్రపోయిన వ్యక్తి. చూస్తే షాక్
రైలు పట్టాలపై గొడుగు వేసుకొని మరీ నిద్రపోయిన వ్యక్తి. చూస్తే షాక్