Pakistani Bride:టర్కిష్ హిస్టారికల్ డ్రామా సిరీస్ డిరిలిస్ ఎర్తుగ్రుల్ లోని ఓ సన్నివేశం ఓ యువతికి నచ్చింది. ఆ సన్నివేశం ప్రభావంతో ఓ వధువు పెళ్లి వేడుకక్కి వచ్చిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తోంది. అయితే వధువు చేసిన పనికి నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. వివరాల్లోకి వెళ్తే..
టర్కిష్ హిస్టారికల్ డ్రామా సిరీస్ డిరిలిస్ ఎర్తుగ్రుల్ పాకిస్తాన్ జనాభాపై అపారమైన ప్రభావం చూపించింది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే.. అంతేకాదు.. ఈ డ్రామా సీరియల్‌లోని సన్నివేశాలు, ఆచారాలు పాకిస్తానీ వివాహాల్లో కూడా చోటు చేసుకున్నాయి. ఓ పాకిస్థానీ వధువు గుర్రంపై తన వివాహ వేదికలోకి ప్రవేశించింది. అంతేకాదు వధువు టర్కిష్ సిరీస్‌లో ఆచరించే కత్తి పట్టుకునే ఆచారాన్ని పాటించింది.
దీంతో పాకిస్థాన్ వధువు వినూత్నమైన మనస్తత్వాన్ని కలిగి ఉన్నట్లు తెలుస్తోంది అంటున్నారు. అంతేకాదు ఆమెకు సాంప్రదాయ పద్దతులను పాటించాలని అనుకోవడం లేదని అంటున్నారు. పాకిస్థానీ వివాహ సంస్కృతిలో భాగమైన ‘దుపట్టా’ (వేణీ )తో వధువు తన ముఖాన్ని కవర్ చేసుకోలేదు. అయితే వధువు వివాహ వేదిక వద్దకు వస్తున్న సమయంలో ఆమెతో చాలామంది సెల్ఫీలు తీసుకోవడానికి ఆసక్తిని చూపించారు. పాకిస్థాన్ నటి రీమా ఖాన్ పెళ్లికూతురుతో సెల్ఫీలు తీసుకోవడం విశేషం..
Ertugrul style entry of Bride at one of her wedding event.
Video @zamalsamanphotography#ICCAwards #SaudiArabia pic.twitter.com/w3t7iEGIvD
— Lollywoodnow_ (@Lollywoodnow1) December 29, 2021
Also Read: ఇంట్లో వివాదాలు, ఆర్ధిక ఇబ్బందులు ఏర్పడుతున్నాయా.. అయితే ఈ రెమిడీస్ పాటించి చూడండి