Pakistani Man: కొత్త ఏడాదిలో 60వ బిడ్డకు స్వాగతం.. 100 మంది పిల్లలే అతడి టార్గెట్.. భార్యలు ఎంత మందంటే

|

Jan 04, 2023 | 1:18 PM

తాను 100 మంది పిల్లలను కనడమే లక్ష్యంగా పెట్టుకున్నానని ప్రకటించి సంచలనం సృష్టించాడు ఒక పాకిస్తానీ వైద్యుడు.  సర్దార్ జాన్ మొహమ్మద్ ఖాన్ ఖిల్జీ తన 60వ బిడ్డకు కొత్త సంవత్సరం 2023లో స్వాగతం పలికాడు.

Pakistani Man: కొత్త ఏడాదిలో 60వ బిడ్డకు స్వాగతం.. 100 మంది పిల్లలే అతడి టార్గెట్.. భార్యలు ఎంత మందంటే
Father Of The Sixtieth Child
Follow us on

ఒక భార్యతోనే వేగలేకపోతున్నాం అనుకుంటున్నారా.. అయితే అతనికి ఇప్పుటికే ముగ్గురు భార్యలున్నారా.. నాలుగో భార్యకోసం చూస్తున్నాడు.. అంతేకాదు ఆమ్మో ఈరోజుల్లో ఒకరిద్దరి పిల్లలను పెంచలేకపోతున్నాం అంటున్నారా.. ఇతను కొత్త సంవత్సరంలో 60వ సంతానానికి స్వాగతం పలికాడు.. అంతేకాదు తాను 100 మంది పిల్లలను కనడమే లక్ష్యంగా పెట్టుకున్నానని ప్రకటించి సంచలనం సృష్టించాడు ఒక పాకిస్తానీ వైద్యుడు.  సర్దార్ జాన్ మొహమ్మద్ ఖాన్ ఖిల్జీ తన 60వ బిడ్డకు కొత్త సంవత్సరం 2023లో స్వాగతం పలికాడు. అంతేకాదు తనకు ఎక్కువ మంది పిల్లలు కావాలని నాల్గవ సారి వివాహం చేసుకోవాలని ఆశిస్తున్నాడు.

క్వెట్టా నగరంలోని తూర్పు బైపాస్ సమీపంలో నివసించే 50 ఏళ్ల పాకిస్తానీ వ్యక్తికి ముగ్గురు భార్యలు ఉన్నారు. జాన్ ముహమ్మద్ ఫ్యామిలీ పెద్ద ఉమ్మడి కుటుంబంగా ప్రసిద్ధి చెందింది. సర్దార్ జాన్ మొహమ్మద్ ఖాన్ ఖిల్జీ వృత్తిరీత్యా వైద్యుడు. ఇతను 2023 సంవత్సరం మొదటి రోజున మరో బిడ్డకు తండ్రి అయ్యాడు.. మగ బిడ్డ జన్మించాడు. దీంతో ఇతని మొత్తం పిల్లల సంఖ్య 60కి చేరుకుంది. జాన్ ముహమ్మద్‌కు ముగ్గురు భార్యలకు కలిపి 60 మంది పిల్లలు జన్మించగా.. వీరిలో ఐదుగురు పిల్లలు మరణించారు. 55 మంది పిల్లలు సజీవంగా.. ఆరోగ్యంగా ఉన్నారు. వీరిలో కొడుకుల కంటే కుమార్తెలే అధికం.

ఇవి కూడా చదవండి

తనకు కొత్త సంవత్సరం ఇచ్చిన 60వ సంతానంతో చాలా సంతోషంగా ఉన్నానని.. ఆ చిన్నారికి హాజీ ఖుష్ ఖల్ ఖాన్ అని పేరు పెట్టినట్లు చెప్పాడు జాన్ ముహమ్మద్. ముగ్గురు భార్యలు , పిల్లలు ఒకే ఇంట్లో నివసిస్తున్నారు.  జాన్ ముహమ్మద్ తన గ్రామా శివారులో తన స్వంత క్లినిక్ నడుపుతున్నాడు. ఇతను ఇప్పుడు నాల్గవ భార్య కోసం అన్వేషణలో ఉన్నాడు. మరొక వివాహాన్ని చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. 100 మంది పిల్లలను కలిగి ఉండడమే తన లక్ష్యమని ఇప్పటికే అతను ప్రకటించి సంచలనం సృష్టించాడు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..