Old Book: పుస్తకాన్ని 90 ఏళ్ల తర్వాత లైబ్రరీకి ఇచ్చిన మహిళ.. ఆలస్యంగా ఇచ్చినందుకు ఫైన్ ఎంత కట్టిందంటే

|

Oct 15, 2023 | 12:25 PM

ఒక మహిళ 90 ఏళ్ల తర్వాత లైబ్రరీకి పుస్తకాన్ని తిరిగి ఇచ్చింది. ఆమె తండ్రి 1933 సంవత్సరంలో ఆ పుస్తకాన్ని లైబ్రెరీ నుంచి ఇంటికి తీసుకుని వెళ్లారు. అయితే అతను ఆ పుస్తకం తిరిగి ఇవ్వడం మరణించాడు. అప్పటి నుంచి ఆ పుస్తకం అలాగే ఇంట్లో ఉండిపోయింది. న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం జిమ్మీ ఎల్లిస్ అనే వ్యక్తి జోసెఫ్ కాన్రాడ్ రాసిన 'యూత్ అండ్ టూ అదర్ స్టోరీస్' అనే పుస్తకాన్ని లార్చ్‌మాంట్ పబ్లిక్ లైబ్రరీ నుంచి తీసుకుని వెళ్ళాడు.

Old Book: పుస్తకాన్ని 90 ఏళ్ల తర్వాత లైబ్రరీకి ఇచ్చిన మహిళ.. ఆలస్యంగా ఇచ్చినందుకు ఫైన్ ఎంత కట్టిందంటే
Larchmont Public Library
Follow us on

లైబ్రరీ.. జ్ఞానాన్ని అందించే దేవాలయం. పుస్తకాలు చదువుకునే వారిని అందుబాటులో ఉండే స్థలం. గ్రంథాలయాలకు వెళ్లి చదువుకోవడానికి స్టూడెంట్స్ కు మాత్రమే చిన్న, పెద్ద అనే తేడా లేకుండా వెళ్తారు.  ఎందుకంటే పుస్తక పఠనం పట్ల ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ దాదాపు అన్ని రకాల పుస్తకాలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. అయితే కొందరు వ్యక్తులు లైబ్రరీ నుండి పుస్తకాలను చదువుకోవడానికి ఇంటికి కూడా తీసుకుని వెళ్లారు. కొందరు తాము చదవడం కంప్లీట్ అయిన వెంటనే తిరిగి ఇచ్చేస్తే.. మరొకొందరు మరచిపోవడం లేదా ఏదైనా కారణం వలన తాము లైబ్రెరీ నుంచి తెచ్చిన పుస్తకం లైబ్రెరీకి తిరిగి ఇవ్వడం మరచిపోతారు. ఇలాంటి ఘటన ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇది ప్రజలను ఆశ్చర్యపరుస్తుంది. ఈ ఘటన అమెరికాలోని న్యూయార్క్‌లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

తర్వాత ఈ పుస్తకాన్ని లైబ్రరీకి తిరిగి ఇవ్వడం మర్చిపోయాడు. ఈ పుస్తకం చాలా సంవత్సరాలు అతని ఇంట్లో ఉంది. ఇంతలో, అతను 1978 సంవత్సరంలో మరణించాడు.

శుభ్రపరిచేటప్పుడు దొరికిన పుస్తకం

జిమ్మీ మరణానంతరం కూడా.. అతని కుమార్తె జోనీ మోర్గాన్ ఆ పుస్తకాన్ని గమనించేంత వరకు చాలా ఏళ్లు ఇంటిలో ఉంది. ఒకరోజు జిమ్మీ కూతురు జానీ ఇంటిని శుభ్రం చేస్తున్నప్పుడు ఆ పుస్తకాన్ని చూసింది. ఏమిటా అని ఆసక్తితో చూడగా.. ఆ పుస్తకం మీద దానిపై లార్చ్‌మాంట్ పబ్లిక్ లైబ్రరీ అనే ట్యాగ్ కనిపించింది. అంతేకాదు ఈ పుస్తకం చాలా పాతది అని గుర్తించింది. దీంతో జానీ ఆ పుస్తకాన్ని లైబ్రరీకి తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకుంది,

90 ఏళ్ల క్రితంతీసుకుని వెళ్లిన పుస్తకం

లైబ్రేరియన్ కరోలిన్ కన్నింగ్‌హామ్ మాట్లాడుతూ.. జానీ మోర్గాన్ నుండి తనకు కాల్ చేసి లైబ్రెరీకి చెందిన ఓ పురాతన పుస్తకం తన దగ్గర ఉందని చెప్పింది. ఆ పుస్తకం ఆమె తండ్రి సుమారు 90 ఏళ్ల క్రితం తీసుకుని వెళ్ళినది. ఈ విషయం తెలిసి చాలా ఆశ్చర్యపోయానని కరోలిన్ చెప్పింది. అయితే ఈ పుస్తకాన్ని ఆలస్యంగా తిరిగి ఇచ్చినందుకు లైబ్రరీ జానీకి 5 డాలర్లు అంటే మన దేశ కరెన్సీలో సుమారు రూ. 417 జరిమానా విధించింది. జిమ్మీ తన సవతి తండ్రి అని, ఈ పుస్తకాన్ని తీసుకున్నది అతనే అని జానీ చెప్పింది. లార్చ్‌మాంట్ లైబ్రరీ దగ్గరలో జిమ్మీ తన మొదటి భార్య,  ఇద్దరు పిల్లలతో నివసించాడు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..