ఇరాన్‌కు ఆయుధాల సరఫరా కట్‌ చేసేందుకు అమెరికా కొత్త వ్యూహం!

ఇరాన్‌ను అన్ని వైపులా కట్టడి చేస్తోంది అమెరికా. ఇప్పటికే ఆ దేశ ఓడరేవులపై నావికాదళ దిగ్బంధనం విధించిన అమెరికా ఇప్పుడు భూమార్గాల్లోనూ ఇరాన్‌కు ఆయుధాలు చేరకుండా అడ్డుకోనుంది. అమెరికాకు చెందిన 20 మంది సభ్యులతో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ బృందం ఇరాన్‌కు ఆయుధాలు, నిషేధిత వస్తువులు, ఇతర అక్రమ సరుకులు చేరవేసేందుకు ఉపయోగించే రోడ్డు మార్గాలను గుర్తించి వాటిని మూసేయనున్నారు.

ఇరాన్‌కు ఆయుధాల సరఫరా కట్‌ చేసేందుకు అమెరికా కొత్త వ్యూహం!
Us To Cut Iran Land Supply Routes

Updated on: Nov 09, 2026 | 4:10 PM

ఎనిమిది నెలలుగా కొనసాగుతున్న అమెరికా-ఇరాన్ యుద్ధంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్‌ను అన్ని వైపులా కట్టడి చేస్తోంది అమెరికా. ఇప్పటికే ఆ దేశ ఓడరేవులపై నావికాదళ దిగ్బంధనం విధించిన అమెరికా ఇప్పుడు భూమార్గాల్లోనూ ఇరాన్‌కు ఆయుధాలు చేరకుండా అడ్డుకోనుంది. అమెరికాకు చెందిన 20 మంది సభ్యులతో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ బృందం ఇరాన్‌కు ఆయుధాలు, నిషేధిత వస్తువులు, ఇతర అక్రమ సరుకులు చేరవేసేందుకు ఉపయోగించే రోడ్డు మార్గాలను గుర్తించి వాటిని మూసేయనున్నారు.

కాస్పియన్ సముద్రం వరకు నిఘా

ఫ్లోరిడా కేంద్రంగా టాస్క్‌ఫోర్స్ అమెరికా ప్రభుత్వంలోని వివిధ విభాగాలతో కలిసి పనిచేస్తుంది.  బృందంలో సైనిక, పౌర విభాగాలకు చెందిన 20 మంది సభ్యులు ఉంటారు. ఇరాన్ భూ సరిహద్దుల గుండా  కాస్పియన్ సముద్రం మీదుగా ఆయుధాలు, సైనిక అవసరాలకు ఉపయోగపడే సాంకేతిక పరిజ్ఞానం, ఆంక్షలు విధించిన వస్తువులను తరలిపోకుండా అడ్డుకుంటుంది. అక్రమంగా నిధులు చేరే మార్గాలపైనా దృష్టి పెట్టబోతుంది.

అమెరికా సెంట్రల్ కమాండ్ చీఫ్ బ్రాడ్ కూపర్ ఎక్స్‌ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు. ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చడం, ఆయుధ తయారీ కేంద్రాలను తిరిగి నిర్మించడం, సైనిక అవసరాల కోసం ఆయుధాలను సమకూర్చడం ఇక ఇరాన్‌కు మరింత కష్టమవుతుందని అన్నారు.

హార్ముజ్ జలసంధి దగ్గర మొదలైన ఉద్రిక్తతలు

అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి హార్ముజ్ జలసంధి అంతర్జాతీయంగా కీలకంగా మారింది. ప్రపంచ చమురు వాణిజ్యంలో దాదాపు ఐదో వంతు ఈ మార్గం గుండానే సాగుతుంది. ఈ వ్యూహాత్మక జలసంధి మీదుగా నౌకల రాకపోకలను ఇరాన్ పరిమితం చేయడంతో ప్రపంచ ఇంధన సరఫరాలపై ప్రభావం పడింది. దీనికి ప్రతిస్పందనగా అమెరికా ఇరాన్ ఓడరేవులపై నావికాదళ దిగ్బంధనాన్ని విధించింది. ఇప్పుడు అదే ఆంక్షలను భూమార్గాలకూ విస్తరించింది. అంటే సముద్రం మీదుగా సరుకుల రవాణాపై ఇప్పటికే ఆంక్షలు ఉండగా భూ సరిహద్దులు, కాస్పియన్ సముద్రం మార్గాలపైనా నిఘా పెరగనుంది.

ఇరాన్‌కు ఇప్పటికే 25 బిలియన్ డాలర్ల నష్టం

అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకారం ఇరాన్ ఓడరేవులపై విధించిన దిగ్బంధనం కారణంగా ఇప్పటివరకు ఇరాన్ లో 25 బిలియన్ డాలర్ల విలువైన ముడి చమురు ఎగుమతులు నిలిచిపోయాయి. తాజాగా భూ మార్గాలపై కూడా ఆంక్షలు అమలైతే ఇరాన్‌కు ఆయుధాలు, సైనిక అవసరాలకు సంబంధించిన వస్తువులు చేరడం మరింత కష్టమవుతుంది.

ఇప్పటికే హార్ముజ్ జలసంధి ఉద్రిక్తతలతో ప్రపంచ దేశాలు ఇంధన సరఫరాలపై ఆందోళన చెందుతున్నాయి. ఇలాంటి సమయంలో అమెరికా తీసుకున్న తాజా నిర్ణయం యుద్ధాన్ని మరో దశకు తీసుకెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. సముద్ర మార్గాలతో పాటు భూ మార్గాలనూ కట్టడి చేయాలన్న అమెరికా వ్యూహం ఇరాన్‌పై ఎంతటి ప్రభావం చూపుతుందో చూడాలి.

Loading...
Unable to load recommendations.
Follow Us