లండన్లో మళ్ళీ.. ‘ ట్రంప్ బేబీ ‘ ప్రొటెస్ట్

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బ్రిటన్ లో పర్యటించనున్నాడు. గతంలో మాదిరే ఆయన పర్యటనకు నిరసనగా ప్రదర్శనకారులు ‘ ట్రంప్ బేబీ ‘ పేరిట ఆరు మీటర్ల భారీ బెలూన్ ని ప్రదర్శించడానికి ఉద్యుక్తులయ్యారు. డయాపర్ చుట్టిన ఈ ఆరెంజ్ బేబీ డాల్ ను ట్రంప్ పర్యటించే మార్గాల్లో ర్యాలీగా తీసుకువెళ్తారట. మహిళల హక్కులను ఆయన కాలరాస్తున్నాడని, పర్యావరణ పరిరక్షణకు ఎలాంటి చర్యలూ తీసుకోవడంలేదని ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు. ఈ నెల 3-5 తేదీల్లో ట్రంప్, మెలనియా లండన్ […]

లండన్లో మళ్ళీ..  ట్రంప్  బేబీ  ప్రొటెస్ట్

Updated on: Jun 03, 2019 | 4:37 PM

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బ్రిటన్ లో పర్యటించనున్నాడు. గతంలో మాదిరే ఆయన పర్యటనకు నిరసనగా ప్రదర్శనకారులు
‘ ట్రంప్ బేబీ ‘ పేరిట ఆరు మీటర్ల భారీ బెలూన్ ని ప్రదర్శించడానికి ఉద్యుక్తులయ్యారు. డయాపర్ చుట్టిన ఈ ఆరెంజ్ బేబీ డాల్ ను ట్రంప్ పర్యటించే మార్గాల్లో ర్యాలీగా తీసుకువెళ్తారట. మహిళల హక్కులను ఆయన కాలరాస్తున్నాడని, పర్యావరణ పరిరక్షణకు ఎలాంటి చర్యలూ తీసుకోవడంలేదని ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు. ఈ నెల 3-5 తేదీల్లో ట్రంప్, మెలనియా లండన్ ను సందర్శించనున్నారు. రాణి ఎలిజిబెత్ బకింహామ్ ప్యాలస్ లో ఇవ్వనున్న విందుకు వారు హాజరవుతారు. గత ఏడాది కూడా బ్రిటన్ లో ట్రంప్ విజిట్ ను వ్యతిరేకిస్తూ నిరసనకారులు పెద్ద ఎత్తున ఇలాంటి బెలూన్ డాల్ తో ప్రొటెస్ట్ చేశారు. బ్రిటన్ పార్లమెంటు లోనూ ఇతని రాకను అనేకమంది ఎంపీలు వ్యతిరేకించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us