ఉక్రెయిన్.. రష్యా (Russia Ukraine ) మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. ఇరు దేశాలకు చెందిన సైనిక దశాలు బాంబులు, మిస్సైల్స్తో దాడి చేసుకుంటున్నారు. ఇప్పటికే ఈ దాడిలో ఉక్రెయిన్ ప్రజలు ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు తీవ్రంగా గాయపడినట్టుగా తెలుస్తోంది. మరోవైపు..రష్యా తీరుపై ప్రపంచ దేశాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రష్యా దాడికి ప్రతి చర్య తప్పదని ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించారు. చిన్న దేశమైన ఉక్రెయిన్ పై రష్యా అన్యాయంగా దాడి చేస్తోందని.. ఈ పరిణామాలకు రష్యానే బాధ్యత వహించాలన్నారు. ఉక్రెయిన్- రష్యా దాడి దృశ్యాలను.. అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు వార్త ఛానెల్స్ ప్రజలకు చేరువచేస్తున్నాయి. ఓవైపు ఉక్రెయిన్.. రష్యా యుద్ధం జరుగుతుండగా..తాజాగా ఓ జర్నలిస్ట్ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.
క్షణాల వ్యవధిలోనే సదరు జర్నలిస్ట్ సోషల్ మీడియాలో పాపులర్ అయ్యాడు. ఇంతకీ అతను ఏం చేశాడో తెలుసుకుందామా.. ప్రస్తుతం ఉక్రెయిన్, రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం.. ప్రస్తుతం అక్కడ నెలకొన్ని పరిస్థితులను ఆ జర్నలిస్ట్ ఏకంగా ఆరు భాషలలో వార్తలను అందిస్తున్నాడు. ఇంగ్లీష్, లక్సెంబర్గిష్, స్పానిష్, పోర్చుగీస్, ఫ్రెంచ్, జర్మన్లతో సహా ఆరు వేర్వేరు భాషల్లో అతను న్యూస్ అందిస్తున్నాడు.
క్రౌథర్.. ది అసోసియేటేడ్ ప్రెస్ ..అంతర్జాతీయ అనుబంధ కరస్పాండెంట్ ఫిలిప్ క్రౌథర్.. ఉక్రెయిన్లోని కైవ్ నుంచి ప్రత్యేక్ష ప్రసారంలో వార్తలు చెబుతున్నాడు. ఇదే సమయంలో అతను ఏకంగా ఆరు వేర్వేరు భాషల్లో మాట్లాడాడు. ఈ వీడియోను అతను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ.. కైవ్ నుంచి ఆరు భాషలలో న్యూస్ కవరేజీ అంటూ ట్వీట్ చేశాడు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
Six-language coverage from #Kyiv with @AP_GMS. In this order: English, Luxembourgish, Spanish, Portuguese, French, and German. pic.twitter.com/kyEg0aCCoT
— Philip Crowther (@PhilipinDC) February 21, 2022
Also Read: Ajith Valimai: అజిత్ పాన్ ఇండియా మూవీ ‘వలిమై’ ట్విట్టర్ రివ్యూ… సోషల్మీడియా ట్రెండింగ్
Manjula Ghattamaneni: నిన్న సితార.. నేడు మంజుల.. కళావతి హుక్ స్టెప్పులకు ఫిదా అవుతోన్న నెటిజన్లు..
Bheemla Nayak: పవర్ స్టార్ సినిమాపై ఏపీ ప్రభుత్వం ఆంక్షలు.. వాటికి అనుమతి లేదంటూ ఆదేశాలు..