
ఎడారి ప్రాంతం అనే ముద్ర నుంచి అపర కుబేర ఆర్థిక సామ్రాజ్యం వరకు.. గల్ఫ్ దేశాల ప్రస్థానం నిజంగా ఓ ఆశ్చర్యం. ఒకప్పుడు కేవలం ఎడారి ప్రాంతాలుగా, ముత్యాల వేట మీద మాత్రమే ఆధారపడిన ప్రాంతాలుగా ఉన్న గల్ఫ్ దేశాలు.. జస్ట్ 50 ఏళ్లలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించే స్థాయికి ఎదగడం ఓ అద్భుతం. కాని, ఒక్క యుద్ధం ఆ అర్ధ శతాబ్దపు ప్రయాణాన్ని రివర్స్ చేసేలా కనిపిస్తోంది. అందునా.. పక్కనే ఉన్న ఇరాన్ నుంచి దాడి జరగడం గల్ఫ్ దేశాలను కలవర పెడుతోంది. పోనీ, ఇరాన్‌పై తిరగబడదామా అంటే.. ఇరాన్‌లో పాలన కుప్పకూలినా, అక్కడ అస్థిరత ఏర్పడినా మిడిల్ ఈస్ట్ మొత్తాన్ని చిన్నాభిన్నం చేస్తుందన్న భయం గల్ఫ్‌ది. ఇరాన్ మద్దతు ఉన్న మిలిటెంట్ గ్రూపులు.. చమురు క్షేత్రాలు, మౌలిక సదుపాయాలపై గెరిల్లా దాడులు చేసే ప్రమాదం ఉంటుందేమో అనేది గల్ఫ్ భయం. ఎడారి ప్రాంతం అనే ముద్ర నుంచి ఆర్థిక సామ్రాజ్యం వరకు.. గల్ఫ్ దేశాల ప్రస్థానం నిజంగా ఓ ఆశ్చర్యం. ఒకప్పుడు కేవలం ఎడారి ప్రాంతాలుగా, ముత్యాల వేట మీద మాత్రమే ఆధారపడిన ప్రాంతాలుగా ఉన్న గల్ఫ్ దేశాలు.. జస్ట్ 50 ఏళ్లలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించే స్థాయికి ఎదగడం...