Sunita williams: సమయం ఆసన్నమైంది.. సునీతా విలియమ్స్‌ భూమిపైకి ఎప్పుడు చేరుకుంటారంటే..

|

Mar 18, 2025 | 1:07 PM

Sunita williams: అంతరిక్షంలో చిక్కుపోయిన భారత సంతతికి చెందిన నాసా ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్‌‎ను భూమి పైకి తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మేరకు నాసా-స్పేస్‌ ఎక్స్‌లు సంయుక్తంగా క్రూ-10 మిషన్‌ను చేపట్టాయి. నలుగురు వ్యోమగాములతో కూడిన ఫాల్కన్‌-9 రాకెట్‌.. మార్చి 15 శనివారం కెనడీ స్పేస్‌సెంటర్‌..

Sunita williams: సమయం ఆసన్నమైంది.. సునీతా విలియమ్స్‌ భూమిపైకి ఎప్పుడు చేరుకుంటారంటే..
Follow us on

భారత సంతతి నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్, అమెరికా వ్యోమగామి బుచ్ విల్ మోర్ లు సుమారు తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. కేవలం వారం రోజుల పాటు అంతరిక్షంలోకి వెళ్లిన వీరు.. ఏకంగా 9 నెలల పాటు అక్కడే ఉండిపోయారు. ఎట్టకేలకు ఇప్పుడు భూమిపైకి తిరిగి వచ్చేందుకు సమయం ఆసన్నమైంది. వారిని క్షేమంగా తిరిగి తీసుకువచ్చేందుకు నాసా ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే స్పేస్‌ నుంచి బయలుదేరిన సునీతా విలియమ్స్, బుచ్ విల్ మోర్‌లు మరికొన్ని గంటల్లో భూమిపైకి చేరుకోనున్నారు. వారు అంతరిక్ష కేంద్రంలో గడిపిన చివరి క్షణాలు అంటూ ఫోటోను షేర్ చేశారు.

Nasa

ఇప్పటికే అంతర్జాతీయ అంతరిక్షం కేంద్ర నుంచి భూమ్మీదకు బయల్దేరిన సునీతా- బుచ్‌ లు మంగళవారం సాయంత్రం 5.57 గంటలకు (భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3.27కు) అమెరికాలో ఫ్లోరిడా సముద్ర తీరంలో ల్యాండ్‌ కానున్నారని నాసా ప్రకటించింది. అనుకూల వాతావరణం నేపథ్యంలో తిరుగు ప్రయాణాన్ని నిర్ణీత సమయం కంటే ఒక రోజు ముందుకు షెడ్యూల్‌ చేసినట్లు నాసా తెలిపింది.

 


ఇది కూడా చదవండి: Sunita Williams: సునీత విలియమ్స్ జీతం ఎంతో తెలుసా? అంతరిక్షంలో ఉన్నందుకు అదనంగా ఎంత?