Robot Police in US: గన్ కల్చర్ కు చెక్ పెట్టేదిశగా అమెరికా.. పోలీసులుగా రంగంలోకి దిగనున్న రోబోలు

|

Nov 26, 2022 | 7:15 AM

గత వారం వర్జీనియాలోని ఓ వాల్‌మార్ట్‌ స్టోర్‌లో మేనేజర్‌ జరిపిన కాల్పుల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి దారుణాలను అరికట్టేందుకు శాన్‌ఫ్రాన్సిస్కో పోలీసులు ఈ సరికొత్త ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చారు.

Robot Police in US: గన్ కల్చర్ కు చెక్ పెట్టేదిశగా అమెరికా.. పోలీసులుగా రంగంలోకి దిగనున్న రోబోలు
Robots Capable In Us
Follow us on

గన్ కల్చర్ కు చెక్ పెట్టేలా అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. కాల్పులకు తెగబడే నేరగాళ్లను శిక్షించేందుకు రోబో పోలీసులను యూజ్ చేయనున్నారు శాన్ ఫ్రాన్సిస్కో పోలీసులు. రోజు రోజుకీ గన్ కల్చర్ తో విచ్చలవిడి కాల్పులకు పాల్పడుతున్న నిందితులకు చెక్ పెట్టేలా అగ్రరాజ్యం అమెరికా సంచలన నిర్ణయం తీసుకుంది. గన్ కల్చర్ తో అరాచకాలు సృష్టిస్తూ.. కాల్పులకు తెగబడుతున్న నేరగాళ్లను చంపటానికి రోబో పోలీసులను ఉపయోగించాలని శాన్‌ఫ్రాన్సిస్కో పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ముసాయిదా ప్రణాళికను సిద్దం చేశారు. ఈ కొత్త పాలసీ ప్రతిపాదనపై శాన్ ఫ్రాన్సిస్కో బోర్డ్ ఆఫ్ సూపర్‌వైజర్స్ రూల్స్ కమిటీ వచ్చే వారం చర్చించనుంది. ఇప్పటికే.. ముసాయిదా విధానాన్ని పర్యవేక్షకులు ఆరోన్ పెస్కిన్, రాఫెల్ మాండెల్‌మాన్ కమిటీలో సభ్యులుగా ఉన్న కొన్నీ చాన్ పరిశీలించారు.

గత వారం వర్జీనియాలోని ఓ వాల్‌మార్ట్‌ స్టోర్‌లో మేనేజర్‌ జరిపిన కాల్పుల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి దారుణాలను అరికట్టేందుకు శాన్‌ఫ్రాన్సిస్కో పోలీసులు ఈ సరికొత్త ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చారు. ప్రస్తుతం 17 రోబోలు పోలీసులు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిలో 12 నిర్వహణలో లేవు. మిగతా వాటిని బాంబు తనిఖీలు, నిర్వీర్యానికి ఉపయోగిస్తున్నారు. తీవ్రమైన నేర ఘటనల్లోనూ వీటిని వినియోగించాలని శాన్ ఫ్రాన్సిస్కో పోలీసులు భావిస్తున్నారు. దీంతో కాల్పుల వంటి ఘటనలను తిప్పికొట్టేందుకు నేరగాళ్లను చంపేలా రోబోల సామర్థ్యాన్ని పెంచాలని భావిస్తున్నారు శాన్ ఫ్రాన్సిస్కో పోలీసులు. మెషిన్లు, గ్రనేడ్ లాంఛర్లతో రోబోలను మార్చాలని డ్రాఫ్ట్‌ డాక్యుమెంట్‌లో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..