Brazil Shootings: స్కూల్‌లోకి ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులు.. ఘటనలో 11 మందికి గాయాలు.. ఎంత మంది చనిపోయారంటే..?

|

Nov 26, 2022 | 6:37 AM

బుల్లెట్ ప్రూఫ్ చొక్కా ధరించిన ఓ షూటర్ ఆగ్నేయ బ్రెజిల్‌లోని రెండు పాఠశాలలపై దాడి చేసి ఇద్దరు ఉపాధ్యాయులు, ఒక విద్యార్థిని కాల్చి చంపినట్లు ఆ దేశ వార్తా సంస్థలు పలు కథనాలను

Brazil Shootings: స్కూల్‌లోకి ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులు.. ఘటనలో 11 మందికి గాయాలు.. ఎంత మంది చనిపోయారంటే..?
Gun Shooting
Follow us on

బ్రెజిల్‌లోని ఓ పాఠశాలలో కాల్పుల ఘటన కలకలం రేపింది. ఈ కాల్పుల కారణంగా ముగ్గురు వ్యక్తులు మరణించగా.. వారిలో ఇద్దరు ఉపాధ్యాయులు, ఒక విద్యార్థి ఉన్నారు. ఇంకా ఆ ఘటనలో కనీసం 11 మంది గాయపడినట్లు సమాచారం. బుల్లెట్ ప్రూఫ్ చొక్కా ధరించిన ఓ షూటర్ ఆగ్నేయ బ్రెజిల్‌లోని రెండు పాఠశాలలపై దాడి చేసి ఇద్దరు ఉపాధ్యాయులు, ఒక విద్యార్థిని కాల్చి చంపినట్లు ఆ దేశ వార్తా సంస్థలు పలు కథనాలను ప్రచురించాయి. కాగా మరో 11 మంది గాయపడ్డారని కూడా ఆ కథనాలు పేర్కొన్నాయి. ఎస్పిరిటో శాంటో రాష్ట్రంలోని అరక్రూజ్ నగరం పోలీసు అధికారులు సంఘటన గురించి సమాచారం ఇస్తూ.. శుక్రవారం ఉదయం పాఠశాలలో కాల్పుల ఘటనకు జరిగాయని. ఘటనలో ఇద్దరు మహిళా ఉపాధ్యాయులు, ఒక విద్యార్థి మృతి చెందగా, 9 మంది గాయపడ్డారని వారు తెలిపారు.  షూటర్ వద్ద సెమీ ఆటోమేటిక్ పిస్టల్ ఉందని వారు చెప్పారు.

కాల్పులు జరిపిన వ్యక్తి అరెస్ట్..

ఓ స్థానిక రేడియో నెట్‌వర్క్‌తో అరక్రూజ్ మేయర్ లూయిస్ కార్లోస్ కౌటిన్హో  మాట్లాడుతూ.. నిందితుడు ఒక పాఠశాలలో కాల్పులు జరిపిన  తర్వాత మరొక పాఠశాలకు వెళ్లాడని, అక్కడ కూడా విచక్షణారహితంగా కాల్పులు జరిపాడని అన్నారు. కాగా అక్కడ నిందితుడిని పోలీసు అధికారులు అరెస్టు చేసినట్లు రాష్ట్ర గవర్నర్ రెనాటో కాసాగ్రాండే తెలిపారు. దీనిపై విచారణ జరిపి త్వరలో మరింత సమాచారం సేకరిస్తామని గవర్నర్ ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి

రాష్ట్రపతి సంతాపం..

పాఠశాలలో జరిగిన కాల్పుల ఘటనపై బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా విచారం వ్యక్తం చేస్తూ, ఇది విషాదమని పేర్కొన్నారు. ఆయన ట్వీట్ చేస్తూ ‘‘దాడుల గురించి తెలిసి చాలా బాధపడ్డాను. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ వ్యవహారంపై విచారణ జరిపేందుకు గవర్నర్ కాసాగ్రాండేకు నా పూర్తి మద్దతు ఉంది’’ అని రాసుకొచ్చారు.

గతంలోనూ ఇలాంటి సంఘటన..

ఇంతక ముందు కూడా బ్రెజిల్ పాఠశాలల్లో కాల్పుల ఘటనలు జరిగాయి. 2011లో జరిగిన కాల్పుల దాడి కారణంగా పాఠశాలలోని  12 మంది చిన్నారులు చనిపోయారు. ఆ పాఠశాల విద్యార్థే విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దీని తరువాత అతను తనను తానే కాల్చుకున్నాడు. 2019 లో కూడా సుజానోలోని ఒక ఉన్నత పాఠశాలలో ఇద్దరు పూర్వ విద్యార్థులు ఎనిమిది మందిని కాల్చి చంపారు. కాల్పుల అనంతరం వారు కూడా ఆత్మహత్య చేసుకున్నారు.

మర్ని అంతర్జాతీయ వార్తల కోసం