Queen Elizabeth 2: ఇదో విషాద సంఘటన.. UKను సుదీర్ఘకాలం పాలించిన చక్రవర్తి, క్వీన్ ఎలిజబెత్ II అస్తమించారు. 96 సంవత్సరాల వయస్సులో ఎలిజబెత్ రాణి కన్నుమూశారు. ఆమె ఆరోగ్యం పరిస్థితి ఆందోళనకరంగా మారటంతో వైద్యులు ఆమెను పరీక్షించారు. రాణి ఆరోగ్య పరిస్థితి చేజారి పోతుందని తెలిసి చాలా మంది అభిమానులు, ప్రజలు లండన్ లోని బకింగ్ హమ్ ప్యాలెస్ వద్దకు చేరుకున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆ దేవుడిని ప్రార్థించడం మొదలుపెట్టారు. అంతలోనే ఎలిజబెత్ 2 చనిపోయినట్టుగా రాజ కుటుంబం ప్రకటించింది. అయితే ఈ సమయంలో బకింగ్ హమ్ ప్యాలెస్ వద్ద జరిగిన ఓ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఆకాశంలో కనిపించిన అరుదైన దృశ్యం అందరినీ ఆకర్షించింది.
#DoubleRainbow appears at #BuckinghamPalace in #London #England as #HRH #QueenElizabethII remains very ill in her home at #BalmoralCastle in #Scotland. #GodSaveTheQueen pic.twitter.com/E0MXToiwft
ఇవి కూడా చదవండి— Daniel Voglesong (@DannyVoglesong) September 8, 2022
క్వీన్ ఎలిజబెత్ 2 మరణ వార్తకు ముందు..అక్కడంతా వర్షం పడింది. వర్షంలోనే అభిమానులు ప్యాలెస్‌కు బారులు తీరారు. ఆమె మరణ వార్త ప్రకటించే సమయానికి బకింగ్ హమ్ ప్యాలెస్ వద్ద వాతావరణ పరిస్థితి విచిత్రంగా మారిపోయింది. అప్పటిదాకా కురిసిన వర్షం ఒక్కసారిగా తెరిపినిచ్చింది. అంతలోనే ఎండతో పాటుగా సన్నని వర్షం పడింది. అదే సమయంలో ఆకాశంలో ఓ అందమైన దృశ్యం కనువిందు చేసింది. ఒకేసారి రెండు ఇంద్రధనుస్సులు ప్రత్యక్షమయ్యాయి. ప్యాలెస్ మీదుగా ఆకాశంలో ఒకదానిపై ఒకటి రెండు ఇంద్ర ధనస్సులు ఏర్పడ్డాయి. బకింగ్ హమ్ ప్యాలెస్ వద్ద చేరినవారంతా ఇది చూసి ఆశ్చర్యపోయారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అయ్యాయి. ‘క్వీన్ ఎలిజబెత్ కు ప్రకృతి కూడా రెండు ఇంద్ర ధనస్సులతో ఘనంగా నివాళి అర్పించింది.’ అంటూ నెటిజన్లు కామెంట్లు కురిపిస్తున్నారు.
రాణి ఎలిజబెత్‌ను గత ఏడాది అక్టోబర్ నుంచే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. నడవడం, నిలబడడం కూడా ఇబ్బందిగా మారింది. దీంతో అప్పటినుంచి స్కాట్లాండ్‌లోని బాల్మోరల్ క్యాజిల్‌లోనే ఉంటున్నారు ఎలిజబెత్ రాణి.. చివరికి అనారోగ్యంతోనే కన్నుమూశారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి