Pakishna: కశ్మీర్ విషయంలో పాత రాగాన్నే పాడిన పాక్ ప్రధాని.. కశ్మీర్ ప్రజల పోరాటానికి అండగా ఉంటామని ట్వీట్..

Pakishna: కశ్మీర్(Kashmir) విషయంలో పాకిస్తాన్ తన పాత పల్లవినే కొనసాగిస్తోంది. కశ్మీర్ భారతదేశం(BHarath) అంతర్భాగం.. మీ జోక్యం వద్దు అంటూ ఎన్ని సార్లు పాకిస్థాన్ ను మందలించిన పట్టించుకోకుండా..

Pakishna: కశ్మీర్ విషయంలో పాత రాగాన్నే పాడిన పాక్ ప్రధాని.. కశ్మీర్ ప్రజల పోరాటానికి అండగా ఉంటామని ట్వీట్..
Imran Khan
Follow us

|

Updated on: Feb 06, 2022 | 12:04 PM

Pakishna: కశ్మీర్(Kashmir) విషయంలో పాకిస్తాన్ తన పాత పల్లవినే కొనసాగిస్తోంది. కశ్మీర్ భారతదేశం(BHarath) అంతర్భాగం.. మీ జోక్యం వద్దు అంటూ ఎన్ని సార్లు పాకిస్థాన్ ను మందలించిన పట్టించుకోకుండా మళ్ళీ మళ్ళీ పాడిన పాత పాటనే పాడుతోంది. పాకిస్తాన్ అగ్ర నాయకత్వం శనివారం కశ్మీర్ ప్రజలకు తన మద్దతును పునరుద్ఘాటించింది. కశ్మీర్ సమస్యపై ఇస్లామాబాద్ తన వైఖరిని విడనాడదని తెలిపింది. ‘కశ్మీర్ సంఘీభావ దినోత్సవం’ సందర్భంగా జరిగిన ర్యాలీలో అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ మాట్లాడుతూ, కాశ్మీరీ ప్రజల స్వయం నిర్ణయాధికారాన్ని గుర్తించే ఐక్యరాజ్యసమితి తీర్మానానికి అనుగుణంగా తమ దేశం కాశ్మీర్ వివాదానికి పరిష్కారాన్ని కోరుకుంటుందని అన్నారు.

పాకిస్తాన్ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 5న ‘కశ్మీర్ సాలిడారిటీ డే’ని జరుపుకుంటుంది. కాశ్మీర్‌పై పాకిస్తాన్ వైఖరి మారలేదని.. తన బాధ్యతను వీడదని అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ అన్నారు. కాశ్మీర్ మన శరీరంలో భాగమని, మన హృదయాలు కలిసి మెలిసి ఉన్నాయని దేశం వారికి అండగా నిలుస్తుందని చెప్పారు.ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC) తీర్మానాలకు అనుగుణంగా.. స్వేచ్ఛాయుతమైన, న్యాయమైన ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా జమ్మూ-కశ్మీర్ సమస్య పరిష్కారానికి పాక్ కట్టుబడి ఉందని.. ఆరిఫ్ చెప్పారు.

చైనా పర్యటనలో పాక్ ప్రధాని ప్రస్తుతం చైనా పర్యటనలో ఉన్న ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ట్విటర్‌లో ‘పాకిస్థాన్ మన కాశ్మీరీ సోదరసోదరీమణులతో ఐక్యంగా ఉంది. కాశ్మీర్ స్వయం నిర్ణయాధికారం కోసం వారి న్యాయబద్ధమైన పోరాటానికి కట్టుబడి ఉంది’ అని అన్నారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా కూడా పాక్ ఆర్మీ కాశ్మీర్ ప్రజల త్యాగం, సంకల్పాన్ని గుర్తుచేసుకున్నారని తెలిపారు. జమ్మూ కాశ్మీర్ ప్రజల ఆకాంక్షలు, ఐక్యరాజ్యసమితి తీర్మానాలకు అనుగుణంగా కాశ్మీర్ సమస్యను పరిష్కరించాల్సిన సమయం ఇది ట్వీట్ చేశారు. కాశ్మీరీ ప్రజలకు పాకిస్థాన్ అండగా ఉంటుందని విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

పాకిస్థాన్ కి భారత్ భయపడదు భారత కేంద్ర మంత్రి, జమ్మూ కాశ్మీర్‌లోని ఉధంపూర్ ఎంపి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ… పొరుగు దేశం కాశ్మీర్ కోసం ప్రపంచవ్యాప్త మద్దతును సంపాదించడానికి టూల్‌కిట్‌ను రూపొందించి… వారి చేస్తున్న ‘కొత్త ప్రయోగాలు’ మనల్ని భయపెట్టలేవని చెప్పారు. ” పాకిస్థాన్‌, భారత్‌ల మధ్య ఏదైనా సమస్య పెండింగ్‌లో ఉంటే, అది జమ్మూ కాశ్మీర్‌లోని ఒక భాగమని… అది పొరుగు దేశం అక్రమ ఆక్రమణలో ఉందని ఆయన అన్నారు.

కాశ్మీర్ దేశంలో అంతర్భాగం: భారతదేశం జమ్మూ కాశ్మీర్ ఎప్పటికీ దేశంలో అంతర్భాగమేనని భారత్ చాలాసార్లు పాకిస్థాన్‌కు చెప్పింది. వాస్తవాన్ని అంగీకరించి, భారత వ్యతిరేక ప్రచారాలన్నింటినీ ఆపాలని పాకిస్థాన్‌కు సూచించింది. జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం భారతదేశంలో అంతర్భాగమని విడదీయరాని భాగమని భారత ప్రభుత్వం గతంలో కూడా స్పష్టం చేసింది. జమ్మూ కాశ్మీర్‌కు సంబంధించిన అంశాలు తమ అంతర్గత విషయమని, తమ సమస్యలను పరిష్కరించుకోగల సామర్థ్యం ఆ దేశానికి ఉందని కూడా భారత్‌ పాకిస్థాన్‌కు తెలిపింది.

Also Read:

మనిషిలో ఈ 5 లక్షణాలు ఉండాలి.. లేనివారి జీవితం జంతువుతో సమానం అంటున్న చాణక్య..

Latest Articles