Pakistan Blast: పాకిస్తాన్‌లో మళ్ళీ బాంబు దాడి.. నలుగురు మృతి.. 15 మందికి గాయాలు

Pakistan Blast: పాకిస్తాన్‌లోని క్వెట్టా ప్రావిన్స్‌లో జరిగిన బాంబు పేలుడులో కనీసం నలుగురు మరణించారు.. మరో 15 మంది గాయపడ్డారు. గురువారం రాత్రి ఈ పేలుడు సంభవించినట్లు అధికారులు..

Pakistan Blast: పాకిస్తాన్‌లో మళ్ళీ బాంబు దాడి.. నలుగురు మృతి.. 15 మందికి గాయాలు
Pakistan Blast

Updated on: Dec 31, 2021 | 3:47 PM

Pakistan Blast: పాకిస్తాన్‌లోని క్వెట్టా ప్రావిన్స్‌లో జరిగిన బాంబు పేలుడులో కనీసం నలుగురు మరణించారు.. మరో 15 మంది గాయపడ్డారు. గురువారం రాత్రి ఈ పేలుడు సంభవించినట్లు అధికారులు చెప్పారు. జిన్నా రోడ్డులోని సైన్స్ కళాశాల సమీపంలో పార్క్ చేసిన కారు సమీపంలో బాంబు పేలుడు సంభవించిందని అధికారులు తెలిపారు. జిన్నా రోడ్ క్వెట్టా లోని ప్రధాన రహదారుల్లో ఒకటి. అంతేకాదు షాపింగ్ కు ప్రసిద్ధి చెందిన ప్రాంతం.. నిరంతరం రద్దీగా ఉండే ప్రదేశం.

ఈ బాంబు పేలుడు ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈ బ్లాస్ట్ లో గాయపడిన వారిని క్వెట్టా సివిల్ ఆసుపత్రిలో చేర్చారు. పేలుడు జరిగిన సమీప ప్రాంతంలోని భవనాల కిటికీలు పగిలిపోయాయని అధికారులు చెప్పారు. పాకిస్థాన్‌లోని ఈ ప్రాంతంలో ఇస్లామిక్ స్టేట్ కదలికలు చాలా చురుకుగా ఉటుంది. అంతేకాదు స్థానిక తాలిబాన్ (TTP) ఉగ్రవాదులు కూడా ప్రతిరోజూ ఇక్కడ దాడి చేస్తారు. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ఈ దాడులు గణనీయంగా పెరిగాయి. ఇమ్రాన్న ఖాన్ ప్రభుత్వం ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవడం కంటే వారితో చర్చలు జరపడానికే ఎక్కువ ఆసక్తి చూపుతోందని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.

టీటీపీ ఉగ్రవాదులు ఆఫ్ఘనిస్థాన్‌లో చురుగ్గా ఉన్నారని.. అక్కడ నుంచే పాకిస్థాన్‌లో దాడులకు పాల్పడుతున్నారని ఇమ్రాన్ ప్రభుత్వం ఇటీవల పేర్కొంది. అయితే ఆ సంస్థపై చర్య తీసుకోవడానికి బదులుగా, దానిని ఆపడానికి ప్రభుత్వం ఆఫ్ఘన్ తాలిబాన్ నుండి సహాయం కోరింది. TTP ఉగ్రవాదులతో చర్చలు జరుపుతున్నామని, తద్వారా వారు పాకిస్థాన్‌లో దాడి చేయడాని నిలిపివేస్తామని పాకిస్థాన్ ప్రభుత్వం తెలిపింది. అయితే ఇమ్రాన్ ప్రభుత్వ తీరుపై సామాన్యులు సైతం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. టెర్రరిస్టులకు పీటీఐ ప్రభుత్వం తలవంచిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

 

Also Read :  వ్యర్ధాలకు అర్ధం కల్పిస్తూ.. వరిపొట్టుతో గ్లాసులు, ప్లేట్లు తయారు చేస్తున్న యువకుడు.. వీడియో వైరల్…

Loading...
Unable to load recommendations.
Follow Us