Watch: పాకిస్తాన్ ఆర్మీకి భారీ షాక్.. కుప్పకూలిన ఎంఐ-17 హెలికాప్టర్, అందరూ మృతి!

పొరుగు దేశమైన పాకిస్తాన్‌లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం చోటుచేసుకుంది. పాకిస్తాన్ ఆర్మీ ఏవియేషన్‌కు చెందిన ఎంఐ-17 (Mi-17) హెలికాప్టర్ ముజఫరాబాద్ సమీపంలో కుప్పకూలిపోయింది. అందులో ప్రయాణిస్తున్న వారందరూ మృతి చెందినట్లు సమాచారం. ఈ ప్రమాదం పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లోని నీలం లోయ ప్రాంతంలో జరిగింది.

Watch: పాకిస్తాన్ ఆర్మీకి భారీ షాక్.. కుప్పకూలిన ఎంఐ-17 హెలికాప్టర్, అందరూ మృతి!
Pakistan Army Helicopter

Updated on: Jun 10, 2026 | 5:45 PM

పొరుగు దేశమైన పాకిస్తాన్‌లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం చోటుచేసుకుంది. పాకిస్తాన్ ఆర్మీ ఏవియేషన్‌కు చెందిన ఎంఐ-17 (Mi-17) హెలికాప్టర్ ముజఫరాబాద్ సమీపంలో కుప్పకూలిపోయింది. అందులో ప్రయాణిస్తున్న వారందరూ మృతి చెందినట్లు సమాచారం. ఈ ప్రమాదం పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లోని నీలం లోయ ప్రాంతంలో జరిగింది. ఈ ఘటనపై పాకిస్తాన్ సైన్యం అధికారికంగా స్పందించగా, హెలికాప్టర్‌లో ఉన్న వారిలో ఎవరూ ప్రాణాలతో బయటపడలేదని ధృవీకరించింది.

పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖ వార్తాపత్రిక ‘డాన్’ కథనం ప్రకారం, హెలికాప్టర్ టేకాఫ్ అవుతున్న సమయంలో సాంకేతిక లోపం తలెత్తడంతో అది అదుపుతప్పి కుప్పకూలింది. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక, పునరుద్ధరణ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని రెస్య్యూ ఆపరేషన్ చేపట్టాయి. అయితే ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అందరూ అక్కడికక్కడే మరణించినట్లు తెలుస్తోంది.

ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) విడుదల చేసిన ప్రకటనలో కూడా సాంకేతిక సమస్యల కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పేర్కొంది. అయితే హెలికాప్టర్‌లో మొత్తం ఎంతమంది ప్రయాణించారనే విషయాన్ని ఇప్పటివరకు అధికారికంగా వెల్లడించలేదు. స్థానిక మీడియా కథనాల ప్రకారం, పైలట్‌తో పాటు సుమారు 20 మంది సైనికులు హెలికాప్టర్‌లో ఉన్నట్లు భావిస్తున్నారు.

ఇటీవల పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో నిరసనలు, భద్రతా పరిస్థితులను పర్యవేక్షించేందుకు పాకిస్తాన్ సైన్యం హెలికాప్టర్లను విస్తృతంగా వినియోగిస్తోంది. ఈ నేపథ్యంలో జరిగిన ప్రమాదం పాకిస్తాన్ సైన్యానికి పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.

కాగా, రెండు రోజుల క్రితమే బలూచిస్థాన్ ప్రాంతంలో కూడా పాకిస్తాన్ సైన్యానికి చెందిన మరో హెలికాప్టర్ ప్రమాదానికి గురైనట్లు వార్తలు వచ్చాయి. వరుసగా రెండు హెలికాప్టర్ ప్రమాదాలు చోటుచేసుకోవడంతో పాకిస్తాన్ సైన్యంలో భద్రతా ప్రమాణాలు, సాంకేతిక నిర్వహణపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తుకు ఆదేశించినట్లు సమాచారం.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Follow Us